ఇమ్రాన్‌ఖాన్ మూడో పెళ్లి కూడా పెటాకులేనా!: ట్విట్టర్‌లో నెటిజన్ల సెటైర్లు

హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, తెహ్రీకె ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు పెళ్లిళ్లు పెద్దగా కలిసొచ్చినట్టు లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన చేసుకున్న మూడో వివాహం కూడా పెటాకులైనట్లే పాక్ స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో మత బోధనలు చేసే బుష్రా మనేకాను ఆయన పెళ్లి చేసుకున్నారు.
అయితే ఇప్పుడు మూడో భార్యతోనూ ఇమ్రాన్‌కు గొడవలు మొదలయ్యాయని, ప్రస్తుతం ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని ఉమ్మత్ అనే ఉర్దూ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. పెళ్లి అయినప్పటి నుంచీ బుష్రా కొడుకు మాత్రం వీళ్లతోనే ఉంటున్నాడు.

ఇమ్రాన్‌ఖాన్‌కు ఇష్టం లేదు
అయితే బుష్రా మొదటి భర్త ఖవార్ ఫరీద్ మనేకా కొడుకు వారితోపాటు ఉండటం ఇమ్రాన్‌ఖాన్‌కు ఇష్టం లేదు. పెళ్లికి ముందే తన బనీ గాలా(ఇమ్రాన్ నివాసం పేరు)లో బుష్రాకు సంబంధించిన వారెవ్వరూ ఉండకూడదని ఇద్దరూ ఒప్పందం చేసుకున్నారు. కానీ బుష్రా తన మొదటి భర్త కుమారుడిని ఇంట్లోనే ఉండనిస్తున్నారు.
బుష్రాకు నచ్చలేదు
అయితే, ఇమ్రాన్ ఇష్టంగా పెంచుకున్న కుక్కలు ఇంట్లో ఉండటం బుష్రాకు నచ్చలేదు. నమాజ్ చేసుకుంటున్నప్పుడు అవి అడ్డుపడుతున్నాయని ఇమ్రాన్‌తో గొడవపడ్డారు. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఇమ్రాన్‌తోపాటు అతని చెల్లెళ్లు కూడా అదే ఇంట్లో ఉంటున్నారు.
మొదటి భర్తతో అయిదుగురు పిల్లలు
వాళ్లకు బుష్రాను పెళ్లి చేసుకోవడమే అసలు ఇష్టం లేదు. దీంతో ఇద్దరి మధ్య దూరం మరింతగా పెరిగింది. బుష్రా వయసు 40కి పైగా ఉంటుంది. ఆమెకు మొదటి భర్తతో అయిదుగురు పిల్లలు ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది కాలంగా ఆధ్యాత్మిక సూచనలు, సలహాలు కోసం ఆమె వద్దకు వెళ్తున్నారు.
ఫిబ్రవరి 18న బుష్రాను పెళ్లాడిన ఇమ్రాన్ ఖాన్
ఇమ్రాన్ ఖాన్ విషయంలో రాజకీయపరంగా ఆమె సూచించిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. దీంతో ఫిబ్రవరి 18న ఆమెను ఇమ్రాన్ ఖాన్ పెళ్లాడారు. గత నెలలోనే మనేకా కూడా తన భర్తకు విడాకులు ఇచ్చింది.1995లో తొలిసారి జెమీమాను పెళ్లి చేసుకున్న ఇమ్రాన్.. 9 ఏళ్ల తర్వాత విడాకులిచ్చాడు.

మూడో పెళ్లి కూడా రెండు నెలల్లోపే
ఆ తర్వాత 2015లో టీవీ యాంకర్ రేహమ్‌ఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. పది నెలల తర్వాత ఆమెకు విడాకులిచ్చాడు. ఇప్పుడు మూడో పెళ్లి కూడా రెండు నెలల్లోపే ముగిసిపోయింది. తాజాగా, ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి పెటాకులైన విషయంపై బయటికిరావడంతో నెటిజన్లు ఇమ్రాన్‌కు సలహాలు ఇస్తూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications