Imran Khan: పాక్ జట్టుపై ఇమ్రాన్ ఫైర్.. ఇదంతా నీ వల్లే అంటూ పీసీబీ మాజీ ఛైర్మన్ విమర్శలు
Imran Khan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన తర్వాత జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని, జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ జట్టు ప్రదర్శన పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానన్నాడు. న్యూజిలాండ్, భారత్ ల చేతిలో ఘోర పరాజయాలను చవిచూసిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు నిలిచింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తన సోదరి అలీమాతో మాట్లాడుతూ.. భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడం పట్ల తన బాధను వ్యక్తం చేశాడు.
1992లో ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న పాకిస్థాన్ జట్టుకు నాయకత్వం వహించిన ఇమ్రాన్ ఖాన్.. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ క్రికెట్ అర్హతలను ప్రశ్నించాడని అలీమా రావల్పిండి జైలు బయట మీడియాతో వెల్లడించారు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఓటమిపై విచారం వ్యక్తం చేశారని ఆమె వెల్లడించారు. నిర్ణయాలు తీసుకునే హక్కును తనకు ఇష్టమైన వ్యక్తులకు ఇస్తే.. చివరకు పాకిస్థాన్ క్రికెట్ చివరికి నాశనం అవుతుందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారని తెలిపారు. క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ ను వీక్షించారని అలీమా చెప్పారు.

ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ క్రికెట్ పేలవ ప్రదర్శనకు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారణమని పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్ సేథి పరోక్షంగా ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ వల్లే పాకిస్తాన్ క్రికెట్ పతనమైందని నజామ్ సేథి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై దేశంలోని క్రికెట్ అభిమానుల ఆగ్రహం సరైనదేనన్నారు. పాకిస్థాన్ క్రికెట్ పతనం 2019 నుంచే ప్రారంభమైందని.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలోని కొత్త మేనేజ్ మెంట్ తీసుకున్న నిర్ణయాలే దానికి కారణమన్నారు. దేశవాళీ క్రికెట్ ను సమూలంగా మార్చేశారని.. పాక్ కు సరికాని ఆసీస్ హైబ్రిడ్ మోడల్ ను ప్రవేశపెట్టారని విమర్శించారు. పీసీబీలో రాజకీయాలు ఎక్కువై పోయాయని.. విదేశీ కోచ్ లను ఎంపిక చేయడం.. ఇష్టమైన వారిని నామినేట్ చేయడం.. లాంటివి ఎన్నో జరిగాయన్నారు. వీటన్నింటిని పట్టించుకోకపోవడం ఇలాంటి దారుణమైన ఫలితాలను చూడాల్సి వస్తోందన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications