Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కంటి చూపు కోల్పోతున్న ఇమ్రాన్ ఖాన్? పాక్ ప్రభుత్వానికి 21 మంది మాజీ కెప్టెన్ల సంచలన లేఖ!

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఇమ్రాన్ ఖాన్‌కు వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరుతూ ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు ఒక్కటయ్యారు. భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ తో సహా మొత్తం 21 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు సంయుక్తంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు లేఖ రాశారు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అభ్యర్థనను ఎలాంటి రాజకీయ ఉద్దేశాలతో కాకుండా స్టేడియంలో ఏర్పడిన క్రీడా స్నేహం, మానవతా దృక్పథంతో మాత్రమే చేస్తున్నామని స్పష్టం చేశారు.

IND vs SL: వరుసగా రెండు శతకాలు.. కొలంబో టెస్టులోనూ ధనాధన్ సెంచరీ!

IND vs SL: వరుసగా రెండు శతకాలు.. కొలంబో టెస్టులోనూ ధనాధన్ సెంచరీ!

కోర్టు ఉత్తర్వులు అమలు చేయడం లేదు..
పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ను ఆస్పత్రికి తరలించి ఆయన వ్యక్తిగత వైద్యులు, ఆయన సోదరి డాక్టర్ ఉస్మా ఖాన్ తో కూడిన వైద్య బృందంతో సమగ్ర పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అతడిని కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే ఆస్పత్రిలో ఉంచి ప్రభుత్వ వైద్యులతోనే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసి తిరిగి అడియాలా జైలుకు తరలించిందని లేఖలో మాజీ కెప్టెన్లు ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Imran Khan Health 21 Former Cricket Captains Write Urgent Letter to Pakistan PM Details

ఇమ్రాన్ ఖాన్ కు కంటి చూపు సమస్య?
ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు మందగించిందనే వార్తల నేపథ్యంలో స్వతంత్ర వైద్యబృందంతో ఆయనకు తక్షణమే ప్రత్యేక చికిత్స అందించాలని మాజీ ఆటగాళ్లు విజ్ఞప్తి చేశారు. అలాగే న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వారి కుటుంబ సభ్యులను కలిసేలా చూడాలని.. ఎలాంటి పరిపాలనా జాప్యం లేదా ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగేలా చూడాలని మాజీ కెప్టెన్లు కోరారు. 73 ఏళ్ల వయసున్న ఇమ్రాన్ ఖాన్ మూడేళ్లకు పైగా కస్టడీలో ఉన్నారని.. రాజకీయ పరమైన అంశాలను పక్కనపెట్టి ఆయన ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడమే మానవతా ధర్మమని వారు గుర్తు చేశారు.

IND vs SL: ఔట్ కాకుండానే పెవిలియన్‌కు రిషబ్ పంత్.. అసలేం జరిగింది?

Also Read

IND vs SL: ఔట్ కాకుండానే పెవిలియన్‌కు రిషబ్ పంత్.. అసలేం జరిగింది?

లేఖపై సంతకం చేసిన ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు వీరే..
6 నెలల క్రితం 14 మంది మాజీ కెప్టెన్లు ఈ విషయమై లేఖ రాయగా.. ఇప్పుడు మరో ఏడుగురు జత కలిసి మొత్తం 21 మంది తాజాగా సంతకాలు చేశారు. ఈ లేఖపై భారత ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ , దిలీప్ వెంగ్‌సర్కార్.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, అలెన్ బోర్డర్, స్టీవ్ వా, ఆడమ్ గిల్క్రిస్ట్, కిమ్ హ్యూస్.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు మైఖేల్ అథర్టన్, సర్ అలస్టైర్ కుక్, డేవిడ్ గోవర్, నాసర్ హుస్సేన్, మైఖేల్ బ్రియర్లీ, సర్ ఆండ్రూ స్ట్రాస్.. వెస్టిండీస్ ఆటగాడు సర్ క్లైవ్ లాయిడ్, శ్రీలంక ఆటగాడు అర్జున రణతుంగ.. న్యూజిలాండ్ ఆటగాళ్లు జాన్ రైట్, లీ జర్మన్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు చెందిన అలెక్స్ బ్లాక్‌వెల్, బెలిండా క్లార్క్ ఆ లేఖపై సంతకాలు చేశారు.

Story first published: Sunday, August 23, 2026, 17:54 [IST]
Other articles published on Aug 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+