Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్‌ను ఓ ఛాంపియన్ జట్టులా నిలబెట్టాడు

Imran Khan changed Pakistan cricket, admits West Indian legend

హైదరాబాద్: పాకిస్థాన్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, మాజీ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్‌పై వెస్టిండిస్ మాజీ క్రికెటర్ కోర్ట్నీ వాల్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలో పాకిస్థాన్ క్రికెట్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టింది ఎవరైనా ఉన్నారంటే అది ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రమే అని కొనియాడాడు.

ఇండియన్ టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్యూలో 1992లో ఇమ్రాన్‌ ఖాన్ నేతృత్వంలో పాకిస్థాన్ జట్టు వరల్డ్‌ కప్‌ గెలవగానే ఆ జట్టు స్వరూపం పూర్తిగా మారిపోయిందని అన్నాడు. ఒక జట్టును చరిత్రలో నిలిచిపోయేలా చేసే ఘనత మంచి కెప్టెన్‌కే సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.

'ఓ మంచి కెప్టెన్ జట్టులో మార్పు తీసుకురాగలడు, అంతేకాదు ఆ జట్టుని చరిత్రలో నిలిచిపోయేలా చేయగలడు. ఈ తరహాలో పాక్‌ జట్టును సానుకూల ధృక్పథంతో ముందుకు నడిపించిన కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్‌. అందుకే ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీకి నేను అతిపెద్ద ఫ్యాన్‌ని' అని వాల్ష్‌ తెలిపాడు.

'వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ లాంటి యువ క్రికెటర్లను ఎంతగానో ప్రోత్సహించాడు. అలా పాకిస్థాన్ జట్టును ఓ ఛాంపియన్ జట్టులా నిలబెట్టాడు' అని కొనియాడాడు. ప్రపంచంలో ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన క్రికెటర్లలో ఇమ్రాన్ ఖాన్‌కి ఒకడిగా గుర్తింపు ఉంది. చాలా మంది యువ క్రికెటర్లకు అతడొక ఐకాన్.

Story first published: Friday, March 2, 2018, 13:30 [IST]
Other articles published on Mar 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+