దీపా కర్మాకర్‌పై సచిన్ ప్రశంస, మోడీకి సెహ్వాగ్ విజ్ఞప్తి
రియో డీ జెనీరో: రియో ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ విభాగంలో కొద్ది తేడాతో పతకం కోల్పోయిన దీపా కర్మాకర్ పైన ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె ప్రయత్నానికి అందరూ కితాబిస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సహా అందరూ మెచ్చుకుంటున్నారు.
ఆటలో గెలుపోటములు సహజమని, దీపా నువ్వు కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్నావని, నిన్ను చూసి దేశం గర్విస్తోందని సచిన్ టెండుల్కర్ ప్రశంసలు కురిపించారు. దీపా కర్మాకర్ పతకం సాధించలేకపోయినప్పటికీ అద్భుత ప్రతిభతో నాలుగో స్థానంలో నిలిచింది.
దీపా కర్మాకర్ నా హీరో అని అభినవ్ బింద్రా అన్నారు. దేశం గర్వించదగ్గ అథ్లెట్ దీపా కర్మాకర్ అని, నీ కథ అందరికీ ఆదర్శపాయం అని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. ఆమె ఆటకు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ముగ్ధుడయ్యారు.

దీపా కర్మాకర్, లలితా బాబర్
అథ్లెట్ లలితా బాబర్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రియో ఒలింపిక్ ప్రతిభ పట్ల వీరేంద్ర సెహ్వాగ్ ముగ్ధుడయ్యారు. వీరిద్దరు ఫైనల్లో పతకం వేటలో వెనుకబడ్డారు. అయినప్పటికీ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

దీపా కర్మాకర్, లలితా బాబర్
ఆదివారం జరిగిన 3000 మీటర్ల మహిళా స్టీప్ లీచెస్ ఫైనల్లో లలిత 10వ స్థానంతో సరిపెట్టుకుంది. దీపా కర్మాకర్ కొద్దిలో కాంస్యం కోల్పోయింది.

దీపా కర్మాకర్, లలితా బాబర్
వీరేంద్ర సెహ్వాగ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో వారి ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వారిని సత్కరించాలని సూచించారు.

దీపా కర్మాకర్, లలితా బాబర్
అతి తక్కువ సమయంలోనే యువతకు ఆదర్శంగా నిలిచిన వారి పేరిట ప్రత్యేక రైలుకు లేదా ప్రత్యేక విమానానికి పేరు పెట్టాలని సూచించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications