Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంబటి రాయుడు అదరహో - IMLT20 టోర్నీ ఛాంపియన్‌గా ఇండియా మాస్టర్స్

ఇండియా మాస్టర్స్‌.. ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ ఛాంపియన్ గా అవతరించింది. తాజాగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్‌ మాస్టర్స్‌ పై విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మాస్టర్స్.. 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ అంబటి రాయుడు(50 బంతుల్లో 9×4, 3×6 సాయంతో 74 పరుగులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ (18 బంతుల్లో 2×4, 1×6 సాయంతో 25 పరుగులు), గుర్‌ కీరత్‌ సింగ్‌ (14) రాణించారు. చివర్లో క్రీజులోకి వచ్చిన యువరాజ్‌ సింగ్ (13*), స్టువర్ట్‌ బిన్నీ (16*) అజేయ్ పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో అష్లే నర్స్‌ 2 వికెట్లు తీశాడు. టినో బెస్ట్‌, బెన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు సాధించింది. మొదట దూకుడుగానే ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన విండీస్ లో ఓపెనర్‌ స్మిత్‌ (35 బంతుల్లో 6×4, 2×6 సాయంతో 45 పరుగులు) అద్భుతంగా రాణించాడు. కెప్టెన్‌ బ్రియాన్‌ లారా (6), పెర్కిన్స్‌ (6) త్వరగానే పెవిలియన్ చేరారు. నదీమ్‌ బౌలింగ్‌లో పెర్కిన్స్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ వెంటనే వినయ్‌కుమార్‌ బౌలింగ్‌లో నేగికి క్యాచ్‌ ఇచ్చి లారా ఔట్ అయ్యాడు.

రెండో డౌన్‌లో వచ్చిన సిమన్స్‌ (41 బంతుల్లో 5×4, 1×6 సాయంతో 57 పరుగులు) హాఫ్ సెంచరీ చేసి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. స్మిత్‌ బౌల్డయ్యాడు. భారత్‌ మాస్టర్స్‌ బౌలర్లలో వినయ్‌ కుమార్‌ 3 వికెట్లు తీయగా.. నదీమ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. నేగి, బిన్నీ తలో వికెట్ దక్కించుకున్నారు.

India Masters defeated West Indies Masters by 6 wickets in the IML 2025 IML 2025 final
Photo Credit: IML 2025 twitter screenshot
Story first published: Monday, March 17, 2025, 0:24 [IST]
Other articles published on Mar 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+