న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మా మామతో పడుకున్నావా.. నీకెలా తెలిసింది'

 Imamul Haq’s befitting response leaves Indian journalist dumbfounded

హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెటర్లు దాదాపు ఏదో ఒక వివాదంలో ఇరుక్కొని నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంటారు. తాజాగా ఇంజమామ్ ఉల్ హక్ మేనల్లుడు ఏకంగా జర్నలిస్టుకే కౌంటర్ ఇచ్చాడు. మేనమామ గురించి అడిగిన సరదా ప్రశ్నకు సీరియస్ గా సమాధానమిచ్చి అక్కడున్న వారిని షాక్‌కు గురి చేశాడు. క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆసియా కప్ సమరం మొదలైంది.

ప్రస్తుతం ఇంజమామ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా ఉన్నాడు. గతేడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన ఇమామ్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది మేనమామకు తగ్గ అల్లుడిగా నిరూపించుకున్నాడు. ఆటతో పాటు మాటల్లోనూ దూకుడు ఎక్కువే కావడంతో విమర్శల పాలవుతున్నాడు పాక్ ఓపెనర్. ఆసియా కప్ నేపథ్యంలో ఇమామ్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.

'మీ మామ, పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఎక్కువ సమయం నిద్రించేవాడు. నువ్వు కూడా అతడిలా నిద్రపోతావా. ఎక్కువగా నిద్రించడం ఇష్టమా' అని ఓ భారత జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఈ క్రికెటర్‌కు చిర్రెత్తుకొచ్చింది. జర్నలిస్ట్ ప్రశ్నపై స్పందిస్తూ.. 'మా మావయ్య చాలాసేపు నిద్రపోతాడని నీకెలా తెలుసు. నువ్వేమైనా అతనితో పడుకున్నావా' అని ఎదురుదాడికి దిగాడు. దీంతో అక్కడున్న స్పోర్ట్స్ జర్నలిస్టులంతా నోరెళ్లబెట్టారు. సరదా ప్రశ్నలకు ఇలా సీరియస్ కావడం మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు.

కోహ్లీలేని భారత జట్టుతో ఆడటం మా జట్టుకు ప్రత్యేకం. మాకు అన్ని మ్యాచ్‌లు సమానమే. ప్రత్యర్థి హాంకాంగ్ అయినా, టీమిండియా అయినా ఒకేలా ఆడతాం. ఏ జట్టును తక్కువ అంచనా వేయం. ఆసియా కప్ నెగ్గేందుకు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తాం. విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాను. ఆసియా కప్‌లో రాణిస్తానని' పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ధీమా వ్యక్తం చేశాడు. మామ ఇంజమామ్ దయతోనే ఇమామ్‌కు పాక్ జట్టులో చోటు దక్కిందన్న విమర్శలున్నాయి.

Story first published: Sunday, September 16, 2018, 9:54 [IST]
Other articles published on Sep 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X