న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కపిల్‌దేవ్‌ 36 ఏళ్ల రికార్డు బద్దలు...

Imam-ul-Haq Breaks Kapil Dev’s 36 Year Old Record In Third ODI Against England || Oneindia Telugu
Imam-ul-Haq breaks Kapil Dev’s 36-year-old record in third ODI against England

భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ 36 ఏళ్ల రికార్డు బద్దలయింది. పాకిస్థాన్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ మన కపిల్‌ రికార్డును బద్దలు కొట్టాడు. తాజాగా ఇంగ్లాండ్‌లో వన్డే క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో 150+ స్కోరు సాధించిన క్రికెటర్‌గా ఇమామ్‌ సరికొత్త ఘనత సాధించాడు. దీంతో కపిల్‌ రికార్డు బద్దలైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

36 ఏళ్ల తర్వాత:

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కపిల్‌ 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అప్పుడు కపిల్ వయసు 24 ఏళ్లు. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇమామ్‌ 151 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇమామ్‌ వయస్సు 23 ఏళ్ళు. అంటే దాదాపు 36 ఏళ్ల తర్వాత కపిల్ రికార్డును ఇమామ్‌ అధిగమించాడు. అయితే ఇమామ్ భారీ సెంచరీ చేసినా పాక్ మాత్రం గెలుపు రుచి చూడలేదు.

 ఇమామ్‌ ఉల్‌ హక్‌ శతకం:

ఇమామ్‌ ఉల్‌ హక్‌ శతకం:

మూడో వన్డేలో మొదటగా బ్యాటింగ్‌ చేసిన పాక్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ ఫఖర్‌ జామన్‌ (2) త్వరగానే పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన బాబర్ ఆజాం (15) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో మరో ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌.. సోహైల్‌ (41), కెప్టెన్ అహ్మద్ (27), అసిఫ్‌ అలీ (52)లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే హక్‌ (151; 131 బంతుల్లో 16 ఫోర్లు, 1సిక్సర్‌) శతకం చేసాడు. చివరలో వసీం (22), ఆసన్ అలీ (18)లు బ్యాట్ జులిపించడంతో పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సామ్ కరన్‌ రెండు వికెట్లు తీసాడు.

బెయిర్‌ స్టో మెరుపులు:

బెయిర్‌ స్టో మెరుపులు:

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా బెయిర్‌ స్టో ఐపీఎల్‌ ఫామ్ కొనసాగిస్తూ.. బౌండరీల మోత మోగించాడు. మరోవైపు జాసన్‌ రాయ్‌ (76) కూడా ధాటిగానే ఆడాడు. ఈ ఇద్దరు తొలి వికెట్ కు 159 పరుగులు జోడించారు. అనంతరం రూట్‌ (43), మొయిన్‌ అలీ (46 నాటౌట్‌)లు పరుగులు చేశారు. రూట్ అవుట్ అయినా.. కెప్టెన్ మోర్గాన్ (17) సహాయంతో అలీ ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో వసీం, జునైద్ ఖాన్, అష్రాఫ్ తలో వికెట్ తీశారు. బెయిర్‌ స్టోకు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Thursday, May 16, 2019, 8:19 [IST]
Other articles published on May 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X