Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువతులతో ఇమాముల్‌ హక్‌ ఛాటింగ్‌.. ట్విటర్‌లో స్క్రీన్‌ షాట్లు!!

Imam-ul-Haq accused of cheating with several women, Screenshots and Pictures viral in Twitter

కరాచీ: తాజాగా పాక్‌ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. పెళ్లి అనంతరం సుమారు ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలను పెట్టుకున్నా అని బహిరంగంగా వ్యాఖ్యానించాడు. దీని నుంచి తేరుకోకముందే పాక్ జట్టుకు మరో తలనొప్పి వచ్చి పడింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ అనేక మంది యువతుల్ని మోసం చేశాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఇమామ్‌ యువతులతో ఛాటింగ్‌ చేసిన స్క్రీన్‌ షాట్లు ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్‌ అయ్యాయి. 'ఇమామ్‌ తన పలుకుబడి ఉపయోగించి అనేకమంది యువతుల్ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతులతో శారీరక సంబంధాలు కూడా కొనసాగించాడని' పాకిస్థాన్‌కు చెందిన ఓ మీడియా పేర్కొంది. ఐదారు నెలల్లోనే ఇవన్నీ జరిగాయని, ప్రపంచకప్‌ సమయంలోనూ ఈ వ్యవహారాలను కొనసాగించాడని పేర్కొంది.

యువతులతో ఇమామ్‌ కొనసాగించిన ఛాటింగ్‌ అనేక స్క్రీన్‌షాట్ల రూపంలో నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇమామ్‌ ఇప్పటివరకు స్పందించలేదు. ప్రపంచకప్‌లో ఇమామ్‌ మంచి ప్రదర్శన చేయలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది. పాక్ చీఫ్‌ సెలక్టర్‌ ఇంజమాముల్‌ హక్‌ మేనల్లుడే ఇమామ్‌. ప్రపంచకప్‌లో ఇమామ్‌ ఆకట్టుకోకపోవడంతో మాజీలు సైతం ఇంజినీ విమర్శించిన విషయం తెలిసిందే. ఇంజీ చీఫ్‌ సెలక్టర్‌ పదవి నుంచి త్వరలో తప్పుకుంటున్నాడు.

Story first published: Thursday, July 25, 2019, 12:45 [IST]
Other articles published on Jul 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+