బీసీసీఐ అధ్యక్ష పదవి చేపడతానని అనుకోలేదు: భవిష్యత్ కార్యాచరణపై గంగూలీ

హైదరాబాద్: "నా తొలి ప్రాధాన్యత ఫస్ట్ క్లాస్ క్రికెట్" ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు కాబోయే బీసీసీఐ ప్రెసిడెంట్. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే ఓ జాతీయ ఛానెల్‌కు ఇంటర్యూ ఇచ్చాడు.
ప్రస్తుతం క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ బీసీసీఐ ఎన్నికలలో ఎటువంటి పోటీ లేకుండా అధ్యక్ష పదవిని ఏకగ్రీవంగా దక్కించుకోనున్నాడు. ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ
తన తొలి ప్రాధాన్యత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కేనంటూ స్పష్టం చేశాడు. ఫస్ట్‌క్లాస్ ఆధారంగా క్రికెటర్లను జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తే అప్పుడు మరింత బలోపేతం అవుతుందని చెప్పాడు.

ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు ప్రాధాన్యత
ఈ విషయాన్ని గతంలో సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ)కు చెప్పినప్పటికీ వారు దానిని పెడచెవిన పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. గంగూలీ మాట్లాడుతూ "రూల్ అదే. ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు ప్రాధాన్యత. దానిపైనే ప్రధానంగా దృష్టి పెడతా. నా తొలి ప్రాముఖ్యత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకే. ఇదే విషయాన్ని సీఓఏకు విజ్ఞప్తి చేశా.. కానీ వారు పట్టించుకోలేదు" అని తెలిపాడు.

రంజీ ట్రోఫీ క్రికెట్‌పై ఫోకస్
"రంజీ ట్రోఫీ క్రికెట్‌పై ఫోకస్ ఉంటుంది. క్రికెటర్లు ఆర్థిక ఆసక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి" అని గంగూలీ తెలిపాడు. 2000వ సంవత్సరంలో భారత జట్టు కెప్టెన్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టిన సమయంలో భారత క్రికెట్ తీవ్ర సంక్షోభవంలో ఉంది. అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం ఓ పెద్ద కుదుపు కుదిపింది. అలాంటి సమయంలో జట్టు పగ్గాలు అందుకున్న గంగూలీ తనదైన శైలిలో దూకుడు నేర్పించి టీమిండియా విదేశాల్లో సైతం టెస్టులు నెగ్గగలదని నిరూపించాడు.

సంతోషంగా ఉన్నా
అయితే, తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా చేయడానికి బీసీసీఐ మెజారిటీ రాష్ట్ర యూనిట్లు మద్దతు తెలపడంపై గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ సంస్థ అయిన బీసీసీఐ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టానికి తాను సిద్ధంగా ఉండటమే కాకుండా, సంతోషంగా కూడా ఉన్నానని గంగూలీ తెలిపాడు. "నేను నియామకంతో సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇది బిసిసిఐ యొక్క ఇమేజ్ దెబ్బతిన్న సమయం. నాకు ఏదైనా చేయటానికి ఇది ఒక గొప్ప అవకాశం" అని గంగూలీ అన్నాడు.

బీసీసీఐ అధ్యక్షుడిని అవుతానని
గంగూలీ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికైనప్పటితో పోలిస్తే ఇప్పుడు తన భావోద్వేగాలు ఎలా ఉన్నాయని మీడియా ప్రశ్నించగా.. టీమిండియా కెప్టెన్‌కి మించిన బాధ్యత మరేదీ లేదని గంగూలీ అన్నాడు. తాను బీసీసీఐ అధ్యక్షుడిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని గంగూలీ అన్నాడు. ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది. ఈ పదవిలో గంగూలీ 2020 సెప్టెంబర్ వరకూ మాత్రమే కొనసాగగలడు.

అధ్యక్షుడిగా బ్రిజేష్ పటేల్ పేరు కూడా!
ఢిల్లీలో శనివారం అమిత్ షాను గంగూలీ కలవడంతోనే గంగూలీ అధ్యక్షుడు ఖాయమనే వార్తలు వచ్చాయి. అయితే 2021 బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని అమిత్ షా కోరగా గంగూలీ హామీ ఇవ్వలేదు. దీంతో శ్రీనివాసన్ వర్గానికి చెందిన బ్రిజేష్ పటేల్ పేరు అధ్యక్షుడిగా తెరపైకి వచ్చింది. అతడి అభ్యర్థిత్వాన్ని ఎక్కువ సంఘాలు వ్యతిరేకించడంతో గంగూలీకి మార్గం సుగమమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications