Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేన్‌ మామకు ఎలా ఇస్తాను? అస్సలు కుదరదు - రచిన్

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 281 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 529 పరుగుల లక్ష్యంతో ఇవాళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 247 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో కైల్ జేమిసన్ నాలుగు వికెట్లు, మిచెల్ శాంట్నర్ మూడు వికెట్లతో సత్తాచాటారు. డబుల్ సెంచరీతో కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన రచిన్ రవీంద్ర (240; 366 బంతుల్లో) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

అనంతరం రచిన్ మాట్లాడుతూ.. ''చాలా బాగుంది. జట్టు విజయంలో మన పాత్ర కొంత ఉన్నా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. ఇక నాలుగు, అయిదు రోజుల పాటు మ్యాచ్ ఆడటం అంత తేలిక కాదు. ఇక నా ఇన్నింగ్స్‌కు మంచి రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే విలియమ్సన్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాను. ఈ భాగస్వామ్యమే విజయంలో ప్రధానపాత్ర పోషించింది'' అని రచిన్ అన్నాడు.

Im not giving that one to Kane Williamson - Rachin Ravindra

కేన్ విలియమ్సన్ తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. రచిన్‌తో కలిసి 232 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతేగాక రెండో ఇన్నింగ్స్‌లో 109 పరుగులు చేశాడు. అయితే విలియమ్సన్‌తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది అవార్డును పంచుకుంటావా అని రచిన్‌తో వ్యాఖ్యాత సరదాగా అడిగాడు. దీనికి రచిన్ బదులిస్తూ.. ''అస్సలు ఇవ్వను. అతడు టెస్టుల్లో 31 సెంచరీలు బాదాడు. ఇది నాకు ఫస్ట్ సెంచరీ. కాబట్టి ఇది కేన్ విలియమ్సన్‌కు ఇవ్వలేను'' అని నవ్వుతూ చెప్పాడు.

కాగా, కెరీర్‌లో తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన రచిన్ రవీంద్ర సరికొత్త రికార్డు సృష్టించాడు. 25 ఏళ్ల తర్వాత ఈ ఘనతను అందుకున్న న్యూజిలాండ్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. 1999లో మాథ్యూ సింక్లెయిర్ 214 పరుగులు చేసి తన తొలి శతకాన్ని డబుల్ సెంచరీగా మార్చాడు. ఇక న్యూజిలాండ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్‌గానూ రచిన్ రవీంద్ర గుర్తింపు పొందాడు.

స్కోరు వివరాలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 511 ఆలౌట్ (రచిన్ (240), విలియమ్సన్ (118); నీల్ బ్రాండ్ 6/119)
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 162 ఆలౌట్ (పీటర్సన్ (45), బెడింగ్‌హమ్ (32); మ్యాట్ హెన్రీ 3/31)
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 179/4 డిక్లేర్ (విలియమ్సన్ (109*), కాన్వే (29); నీల్ బ్రాండ్ 2/52)
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 247 ఆలౌట్ (బెడింగ్‌హమ్ (87), హంజా 36; జేమిసన్ 4/58)

Story first published: Wednesday, February 7, 2024, 13:26 [IST]
Other articles published on Feb 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+