Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆల్‌రౌండర్‌ని అయితే టెయిలెండర్‌గా మార్చారు కదరా!: పాక్ క్రికెటర్

పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌ కోల్పోయి పరువు పోగొట్టుకున్న పాక్‌‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ ఆటగాడు ఇఫ్తికర్ అహ్మద్ తమ జట్టులోని దారుణ పరిస్థితిని తాజాగా వివరించాడు. ప్రయోగాల పేరుతో ఆల్‌రౌండర్‌ అయిన తనని టెయిలెండర్‌గా మార్చారని వాపోయాడు.

తాను ఆల్‌రౌండర్ అనే విషయాన్నే మరిచిపోయినట్లుగా వ్యంగ్యంగా సొంత జట్టును విమర్శించుకున్నాడు. పాక్ జట్టులో తన పాత్ర గురించి ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఇఫ్తికర్ ఇలా సమాధానం ఇచ్చాడు. ''నేను మిడిలార్డర్ బ్యాటర్ కాదు, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌ని. నేను ఆల్‌రౌండర్‌ను కాదు, టెయిలెండర్‌ని. మీరు చూస్తున్నారుగా.. నేను ఏడు లేదా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నా''

I m a Tailender Not an All-Rounder Iftikhar Ahmed s Candid Take on His Role in Pakistan Team

''నాలుగు లేదు అయిదు స్థానాల్లో బ్యాటింగ్ చేసే వాళ్లను ప్రపంచ వ్యాప్తంగా మిడిలార్డర్ అంటారు. కానీ నేను ఏడు-ఎనిమిది స్థానాల్లో ఆడుతున్నాను. కాబట్టి నేను టెయిలెండర్‌గా భావిస్తున్నాను'' అని ఇప్తికర్ పేర్కొన్నాడు. పాక్ తరఫున ఇఫ్తికర్ చివరిగా టీ20 వరల్డ్ కప్‌-2024లో భారత్‌తో మ్యాచ్ ఆడాడు. అనంతరం పాక్ తుదిజట్టులో చోటు దక్కించుకోలేదు.

కాగా, పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన గురించి ఆ దేశ మాజీ క్రికెటర్లు కీలక వ్యాఖ్యలు చేయడం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కెప్టెన్సీ మార్పులు, ఆటలో నాణ్యత లేకపోవడం వంటి కారణాలు తమ జట్టు ఓటమికి ప్రధాన కారణాలు అని పేర్కొంటున్నారు. తాజాగా ఇఫ్తికర్ వ్యాఖ్యలతో అతి ప్రయోగాలతో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని తెలుస్తోంది.

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను పాకిస్థాన్ 0-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై విజయం లేకుండా పాక్ వరుసగా పది టెస్టులు ముగించింది. 2021 నుంచి పాక్‌కు గెలుపు దక్కట్లేదు.గత పది మ్యాచ్‌ల్లో ఆరింట్లో ఓటమి పాలైంది. నాలుగ మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. ఈ క్రమంలో గత ఆరు దశాబ్దాల్లో టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ తమ పేలవ ర్యాంక్‌ను అందుకుంది. ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 1965 తర్వాత టెస్టు ర్యాంకింగ్స్‌లో పాక్‌కు ఇదే దారుణమైన ర్యాంక్.

Story first published: Monday, September 9, 2024, 16:15 [IST]
Other articles published on Sep 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+