For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

థ్రిల్లింగ్ మ్యాచ్.. ప్చ్.. ఒక్క పరుగుతో ముంబయి ఇండియన్స్ ఓటమి!

దుబాయ్‌ వేదికగా ప్రారంభమైన ఇంటర్నేషన్‌ లీగ్‌ టీ20, 2025 ఎడిషన్‌ లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ ఎమిరేట్స్‌ తమ జర్నీని ఓటమితో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లోనే దుబాయ్‌ క్యాపిటల్స్‌ పై పరాజయాన్ని అందుకుంది. తప్పక గెలుస్తుందనున్న మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓటమి రుచి చూసింది. విధ్వంసకర ప్లేయర్స్ నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పోలార్డ్‌ జట్టులో ఉన్నప్పటికీ ముంబయి ఇండియన్స్‌కు ఓటమి తప్పలేదు.

ఒక్కడే హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ కు దిగిన దుబాయ్‌ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. రోవమన్‌ పావెల్‌ (25), దసున్‌ షనక (13), కెప్టెన్‌ సికందర్‌ రజా (10), షాయ్‌ హోప్‌ 9, రొస్సింగ్టన్‌ 9, గుల్బదిన్‌ నైబ్‌ 2, ఫర్హాన్‌ ఖాన్‌ 2 (నాటౌట్‌) విఫలమయ్యారు. ముంబయి పేసర్‌ ఫజల్‌హక్‌ ఫారూకీ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. అల్జరీ జోసఫ్‌, జహూర్‌ ఖాన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ILT20 Season 3 Dubai Capitals edge MI Emirates by one run in a last-ball thriller

చివరి బంతికి ఆరు పరుగులు
స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి జట్టు తడబడింది. 23 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లింది. అప్పుడు కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (40 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టును గెలిపించేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. పూరన్‌కు అకీల్‌ హొసేన్‌ (31 బంతుల్లో 30; 2 ఫోర్లు) కాస్త సహకరించాడు.

ఆఖరి ఓవర్‌లో కీరన్‌ పోలార్డ్‌ (15 బంతుల్లో 16 నాటౌట్‌; 2 ఫోర్లు) రాణించినప్పటికీ ఫలితం దక్కలేదు. లాస్ట్ బాల్ కు ఆరు పరుగులు అవసరముండగా, పోలార్డ్‌ బౌండరీ బాదాడు. దీంతో లక్ష్యం ఛేదించలేకోపోయారు. వాస్తవానికి ఓ దశలో ముంబయి ఎమిరేట్స్‌ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. కానీ ఫైనల్ గా దుబాయ్‌ క్యాపిటల్స్‌ పరుగు తేడాతో గెలిచేసింది.

Story first published: Sunday, January 12, 2025, 13:35 [IST]
Other articles published on Jan 12, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+