న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా బౌలింగ్ వెనుక 'రాకెట్‌ సైన్స్‌': ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ వెల్లడి

Rocket Science Behind Jasprit Bumrah's Bowling Excellence ! || Oneindia Telugu
IIT Professor Reveals the Rocket Science Behind Jasprit Bumrahs Bowling Excellence

హైదరాబాద్: భారత అత్యుత్తమ బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఒకడు. తన బౌలింగ్ టెక్నిక్‌తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్‌కు ముచ్చెమటలు పోయిస్తున్నాడు. అయితే, బుమ్రా బౌలింగ్ విజయం వెనుకున్న రహస్యాన్ని ఐఐటీ-కాన్పూర్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌ మిట్టల్‌ కనిపెట్టానని అంటున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

మిట్టల్ తన స్టడీలో బుమ్రా స్పీడ్, సీమ్ పొజిషన్ వెనుక రాకెట్‌ సైన్స్‌ దాగి ఉందని చెబుతున్నారు. బుమ్రా రివర్స్‌ మాగ్నస్‌ ఫోర్స్‌ను రాబట్టి బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తన స్టడీలో తేలిందని చెప్పారు. 1,000 RPMతో బుమ్రా బంతులు వేస్తున్నాడు కాబట్టి 0.1 స్పిన్ నిష్పత్తిలో ఆ బంతికి స్పిన్ తోడవుతుందని తెలిపారు.

వేగంతో పాటు సీమ్‌ కలిగిన

వేగంతో పాటు సీమ్‌ కలిగిన

వేగంతో పాటు సీమ్‌ కలిగిన బుమ్రా విసిరే బంతికి స్పిన్‌ తోడవడంతో బంతి దిశ మారి మాగ్నస్‌ ఫోర్స్‌ కాస్త రివర్స్‌ మాగ్నస్‌ ఫోర్స్‌గా రూపాంతరం చెందుతుందని ఆయన వెల్లడించారు. దీనివల్ల బంతి నేలను తాకిన తర్వాత అనూహ్యంగా బౌన్స్‌ అవుతుందని అన్నారు. బుమ్రా యాక్షన్ భిన్నంగా ఉండటానికి ఇది దోహదపడుతుందని అన్నారు.

ముంబై విజయంలో బుమ్రా కీలకపాత్ర

ముంబై విజయంలో బుమ్రా కీలకపాత్ర

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్‌ను గెలుచుకోవడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు మొత్తం 77 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన బుమ్రా 82 వికెట్టుల తీశాడు. ఇక, భారత్ తరుపున 49 వన్డేలాడి 85 వికెట్లు, 10 టెస్టుల్లో 49 వికెట్లు, 42 టీ20ల్లో 51 వికెట్లు పడగొట్టాడు.

టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి

టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా గత కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది. కాగా, 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం.

వరల్డ్‌కప్‌లో మొత్తం 10 జట్లు

వరల్డ్‌కప్‌లో మొత్తం 10 జట్లు

ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Story first published: Sunday, May 19, 2019, 13:26 [IST]
Other articles published on May 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X