ఐపీఎల్ ఎఫెక్ట్: ఐఐటీ మద్రాస్ స్టూడెంట్స్‌కు ధోనికి సంబంధించిన ప్రశ్న!

హైదరాబాద్: పిచ్, ప్రత్యర్ధి జట్టు బలం, టీమ్ బలంతో పాటు క్రికెట్ మ్యాచ్‌లో టాస్ కూడా ఎంతో కీలకం. ముఖ్యంగా టీ20ల్లో టాసే మ్యాచ్ విజేతలను నిర్ణయించిన సందర్భాలు అనేకం. అలాంటి టాస్‌పై ఐఐటీ మద్రాస్ ఓ ప్రశ్ననే రూపొందించింది. టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కెప్టెన్ ధోని టాస్ గెలిస్తే ఎం చేస్తాడు?
ఈ మ్యాచ్‌కు ఒక్కరోజు ముందు మే 6న జరిగిన ‘మెటీరియల్ అండ్ ఎనర్జీ బ్యాలెన్స్' పరీక్షలో ఐపీఎల్ 12వ సీజన్ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని టాస్ గెలిస్తే ఎం చేస్తాడు? అనే ప్రశ్నను ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నను ఇచ్చింది ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ విగ్నేష్ ముత్తు విజయన్.
స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్
ఇందుకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ స్క్రీన్ షాట్‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. కాగా, చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
సీఎస్‌కే జట్టులో అంబటి రాయుడు 37 బంతుల్లో 42(3 ఫోర్లు), ధోని 29 బంతుల్లో 37(3 సిక్సులు)తో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. అనంతరం సీఎస్‌కే నిర్దేశించిన 132 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.

మూడు మ్యాచ్‌ల్లోనూ సీఎస్‌కే ఓటమి
సూర్యకుమార్ యాదవ్ 54 బంతుల్లో 71(10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐదోసారి ఫైనల్‌కు చేరగా... సీఎస్‌కే మాత్రం ఈ సీజన్‌లో మరో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఈ సీజన్‌లో ముంబైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సీఎస్‌కే ఓడిపోవడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications