
హైదరాబాద్: మ్యాచ్‌లో పక్కకు పెట్టేసిన కేఎల్ రాహుల్, అజింకా రహానే, ఇషాంత్ శర్మలు మాత్రమే ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. ఏమైందో కానీ, మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు హోటల్ రూమ్‌లో ఇంకా విశ్రాంతి తీసుకుంటూ..నే ఉన్నారు.
కేప్‌టౌన్ తొలి టెస్ట్‌లో విజయం అందినట్లే అనుకున్న తరుణంలో అవకాశం చేజారడంతో నిరాశ చెందిన భారత క్రికెటర్లు కనీసం ప్రాక్టీస్ వైపుకు కన్నెత్తి కూడా చూడట్లేదు. కానీ, తొలి టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన వైస్ కెప్టెన్ రహానే, కేఎల్ రాహుల్, ఇషాంత్ శర్మ మాత్రమే మంగళవారం నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చారు.
ఆప్షనల్ ప్రాక్టీస్ అని చెప్పడంతో మిగతా ఆటగాళ్లందరూ హోటల్ రూమ్‌లను విడిచి రాలేదు. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ ముగ్గురి ప్రాక్టీస్ సెషన్‌ను అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పర్యవేక్షించారు.
తొలి టెస్టుకు ముందు ఆప్షనల్ ప్రాక్టీస్ అని చెప్పినప్పుడు ఒక్కరు కూడా ప్రాక్టీస్‌లో పాల్గొనని విషయం తెలిసిందే. పక్కపక్క నెట్స్‌లో రహానే, రాహుల్ తమ బ్యాటింగ్‌కు పదును పెట్టుకున్నారు.
ప్రాక్టీస్ ఇలా జరిగింది.:
నెట్ బౌలర్లు విసిరిన త్రోడౌన్స్‌ను ఎదుర్కొన్నారు. ఇషాంత్ పూర్తిగా బౌలింగ్‌కే పరిమితమయ్యాడు. రాహుల్, రహానేకు బంతులు వేస్తూ కనిపించాడు. సెషన్ చివర్లో వచ్చిన పార్థివ్ పటేల్ కాసేపు ప్రాక్టీస్ చేశాడు.
కొసమెరుపు:
విదేశాల్లో మంచి రికార్డు ఉన్న రహానేను తొలి టెస్టుకు పక్కనబెట్టడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈనెల 13 నుంచి సెంచూరియన్‌లో జరిగే రెండో టెస్టుకు అతన్ని తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.