న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరచిపోవడమే మహదానందంగా ఉంది: రవిశాస్త్రి

Ignorance is bliss, says Ravi Shastri on tackling social media trolls

న్యూఢిల్లీ: వయస్సుతో పాటు సెలబ్రిటీ హోదా పెరుగుతున్న కాలం ఫోకస్ కూడా పెరుగుతూనే ఉంటుంది. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రిపై కూడా ఇదే ప్రభావం పడుతోంది. అయితే కెప్టెన్ కోహ్లీ సారథ్యంలో ఇంగ్లాండ్ పర్యటన చేసిన టీమిండియా ఆడిన మూడు ఫార్మాట్లలో రెండింటిలో పరాజయం చెందడంతో దానికి పూర్తి బాధ్యతను రవిశాస్త్రిదే అని నెటిజన్లు కామెంట్లతో తీవ్రంగా దాడి చేశారు. ఆ క్రమంలో రవిశాస్త్రిది ఒక్క ఫొటో దొరికినా వైరల్ అయిపోయే పరిస్థితి నెలకొంది.

ఏదైనా ట్వీట్ కానీ, పోస్టు కానీ పెడతా:

ఏదైనా ట్వీట్ కానీ, పోస్టు కానీ పెడతా:

అతనేం మాట్లాడినా నెటిజన్లు మాట్లాడుకోవడానికి ఒక విషయం దొరికేసినట్లే. ఇటీవలే ఆసియా కప్ ముగిసిన నేపథ్యంలో రవిశాస్త్రిని అక్కడి మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన రవిశాస్త్రి.. తనకు అస్సలు ఈ సోషల్ మీడియా గురించి పట్టించుకునే సమయమే ఉండదని చెప్పుకొచ్చాడు. తనకు సమయం దొరికినప్పుడు కేవలం ఒకట్రెండు వార్తా పత్రికలు చదువుతానని తెలిపాడు. ఇంకా సమయముంటే తానే ఏదైనా ట్వీట్ కానీ, పోస్టు కానీ పెడతాడు గానీ, వేరే వాళ్లవి చదివేంత తీరిక ఉండదని వివరించాడు.

అస్సలు పట్టించుకోను.. రోజూ తీరిక లేకుండా

అస్సలు పట్టించుకోను.. రోజూ తీరిక లేకుండా

'నేను అస్సలు పట్టించుకోను. నా పనిలో భాగంగా రోజూ తీరిక లేకుండా గడుపుతాను. ఎప్పుడో ఓ సారి ఒకట్రెండు పేపర్లు చదువుతాను. నాకంతే సమయముంటుంది. అంతకంటేమించి వేరేది చేసేంత గ్యాప్ ఉండదు. ఇక ప్రముఖ సోషల్ మీడియాలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ట్వీట్ నేనే చేస్తాను. వాటికి బదులు ఏం వచ్చిందోనని చదువుకునేంత తీరిక ఉండదు' అంటూ స్పష్టం చేశాడు.

వాళ్ల వాదనలన్నీ వినాల్సిన అవసర్లే

వాళ్ల వాదనలన్నీ వినాల్సిన అవసర్లే

'ఎవరైనా ఏదైనా వాగితే అది వాళ్లకే వదిలేస్తా. నీపై నీకు నమ్మకముంటే వాళ్ల వాదనలన్నీ వినాల్సిన అవసర్లేదు. నీ వల్ల అయినంత వరకూ అంటే వంద శాతం కష్టపడుతున్నానని నువ్వు అనుకుంటే మిగిలిన వాళ్ల మాటలు పట్టించుకునే పనిలేదు. ఒకవేళ అవన్నీ పట్టించుకోవడం మొదలుపెట్టావంటే నీ జీవితంలో చాలా పరిస్థితులను మిస్సయిపోతావు. అందుకే చెప్తున్నా మరిచిపోవడం మహదానందంగా ఉంటుంది'

 ఆస్ట్రేలియాలో 3వన్డేలు, 4 టెస్టులు, 3 టీ20ల్లో:

ఆస్ట్రేలియాలో 3వన్డేలు, 4 టెస్టులు, 3 టీ20ల్లో:

ఆసియా కప్ విజయం తర్వాత రవిశాస్త్రి టీమిండియా మరో విదేశీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా చుట్టేయనుంది. ఈ క్రమంలో జట్టుతో పాటుగా రవిశాస్త్రి వెళ్తాడా అనేది నిర్ణయించే క్రమంలో బోర్డు ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనలో 3వన్డేలు, 4 టెస్టులు, 3 టీ20ల్లో భారత్ పాల్గొననుంది. అయితే ఈ పర్యటనలో విజయం సాధించడానికి తన ఫోకస్‌ను మారుస్తున్నానని హెడ్ కోచ్ తెలిపాడు.

Story first published: Tuesday, October 2, 2018, 12:35 [IST]
Other articles published on Oct 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X