Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జింబాబ్వే చేతిలో భారత్ ఓడిపోతే..!!

If Zimbabwe beat India, Rohit Sharma led team will face New Zealand in Semi Finals at Sydney

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భారత క్రికెట్ జట్టు ఇవ్వాళ తన చిట్టచివరి మ్యాచ్ ఆడుతోంది. జింబాబ్వేతో తలపడుతోంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో కొద్దిసేపటి కిందటే మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ దిగింది. ఆరు ఓవర్లల్లో వికెట్ నష్ట పోకుండా 50 పరుగులు చేసింది. కేప్టెన్ రోహిత్ శర్మ- 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ - 20, విరాట్ కోహ్లీ- 10 పరుగులతో ఆడుతున్నారు.

పాక్‌కు బాటలు..

పాక్‌కు బాటలు..

కాగా- చివరి సూపర్ 12 మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడం వల్ల సమీకరణాలన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి. సెమీ ఫైనల్స్‌కు చేరాల్సిన దక్షిణాఫ్రికా ఈ ఓటమితో ఇంటిదారి పట్టింది. అనూహ్యంగా పరాజయాన్ని చవి చూసిన అనంతరం సెమీస్ చేరే అవకాశాలను చేేజేతులా పోగొట్టుకుంది. అదే సమయంలో పెట్టే బేడా సర్దు కోవాల్సిన పాకిస్తాన్.. సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

అలాంటి రిజల్ట్ వస్తే..

అలాంటి రిజల్ట్ వస్తే..

అలాంటి ఫలితమే పునరావృతమైతే ఎలా ఉంటుంది?.. జింబాబ్వే గనక టీమిండియాను ఓడించితే ఏమౌతుంది? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమౌతోన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిచినా, ఓడినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే- ఇప్పటికే రోహిత్ సేన సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది కూడా. దక్షిణాఫ్రికా ఓటమి- అటు పాకిస్తాన్‌కు సెమీస్ అవకాశాలను కల్పించడంతో పాటు భారత్‌ను కూడా అక్కడికి చేర్చింది.

జింబాబ్వే గెలిస్తే..

జింబాబ్వే గెలిస్తే..

ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిచిందనే అనుకుంటే- సెమీ ఫైనల్స్‌లో భారత ప్రత్యర్థి జట్టు మారుతుందంతే. ఇప్పుడున్న సమీకరణాల ప్రకారం- సెమీ ఫైనల్స్‌లో భారత్.. ఇంగ్లాండ్‌ను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీన 1:30 గంటలకు అడిలైడ్ ఓవల్‌లో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. జింబాబ్వేపై భారత్ ఘన విజయాన్ని సాధించితే- సెమీస్‌లో జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లాండ్‌ను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ప్రత్యర్థి జట్టు మారుతుంది.

ఇంగ్లాండ్‌కు బదులుగా..

ఇంగ్లాండ్‌కు బదులుగా..

ఇంగ్లాండ్‌కు బదులుగా న్యూజిలాండ్‌ను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఎందుకంటే- పాయింట్ల పట్టికలో టీమిండియా ఒక స్థానం కిందికి దిగజారుతుంది కాబట్టి. గ్రూప్ 1లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్.. గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టును సెమీ ఫైనల్స్‌లో ఢీ కొడుతుంది. గ్రూప్ 2లో టాప్ పొజీషన్‌లో ఉన్న జట్టు గ్రూప్ 1లో రెండో స్థానంలో ఉన్న జట్టును ఎదుర్కొంటుంది. దీని ప్రకారం చూసుకుంటే- ఈ మ్యాచ్‌లో ఓడితే రెండో స్థానంతో సరిపెట్టుకుంటుంది టీమిండియా.

తుదిజట్టులో..

తుదిజట్టులో..

టీమిండియా తుదిజట్టులో- కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఆడుతున్నారు. జింబాబ్వేలో- వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), రెగిస్ చకబ్వా (వికెట్ కీపర్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, టోనీ మున్యోంగా, ర్యాన్ బర్ల్, టెండై చటారా, రిచర్డ్ ఎన్‌గరావా, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబని ఉన్నారు.

Story first published: Sunday, November 6, 2022, 14:19 [IST]
Other articles published on Nov 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+