మేం దేనికైనా రెడీ.. కాచుకుని ఉన్నాం, పాక్‌ను పరోక్షంగా హెచ్చరించిన లంక సారథి షనక

ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇరు జట్లు టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంక బౌన్స్ బ్యాక్ అయిన విధానం ఈ టోర్నీకే హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు ఆ జట్టు కెప్టెన్ దసున్ షనక మాట్లాడుతూ.. టాస్ ఓడిపోతే తమ జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి కూడా రెడీగా ఉందని, ఎలాంటి బౌలింగ్ అయినా ధాటిగా ఆడగలమని పేర్కొన్నాడు. తద్వారా పాకిస్థాన్‌కు పరోక్షంగా హెచ్చరికలను జారీ చేశాడు. ఆసియాకప్ 50ఓవర్ల ఫార్మాట్‌లో జరిగినప్పుడు 2014లో శ్రీలంక పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ ఎగురేసుకువెల్లింది. ఆనాటి విజయాన్ని మళ్లీ పునరావృతం చేయాలని లంక లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు దశాబ్దకాలంగా ఆసియాకప్ టైటిల్ నెగ్గని పాకిస్థాన్ ఈసారి ఎలాగైన దాన్ని అందుకోవాలని చూస్తుంది. ప్రస్తుతం టీం చాలా పటిష్ఠంగా ఉండడంతో ఇదే మంచి తరుణంగా భావిస్తుంది.

ఛేజింగ్ చేసిన ప్రతిసారి గెలిచిన లంక
2022 ఆసియా కప్‌లో ఇప్పటివరకు టాస్ కీలక పాత్ర పోషించింది. దాదాపుగా జట్లు ఫీల్డింగ్ ఎంచుకున్న ప్రతిసారి మ్యాచ్‌లు గెలుపొందాయి. ముఖ్యంగా దుబాయ్ స్టేడియంలో తొలుత బౌలింగ్ చేస్తే మ్యాచ్ గెలిచినట్లేననే సెంటిమెంట్‌కు వేదికగా మారింది. అందువల్ల తొలుత టాస్ గెలవడం కూడా కీలకంగా పరిణమించింది. ఇకపోతే టాస్ గెలిచి ప్రతిసారీ బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆ అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. సూపర్ 4లో ఆఫ్ఘనిస్థాన్, ఇండియా, పాకిస్థాన్‌ను ఓడించిన శ్రీలంక యువ టీం మంచి ఉత్సాహంతో ఉంది.

ఒకవేళ టాస్ ఓడిపోతే..
'చూడండి దుబాయ్ స్టేడియంలో టాస్ చాలా ముఖ్యమైన అంశం, అది మా చేతుల్లో లేని అంశం. కానీ ఇప్పటికీ మా బ్యాట్స్‌మెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినా.. రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసినా బానే ఆడారు. మేము ఇక్కడ ఆడిన అన్ని ఆటలను ఛేజింగ్ చేసేటప్పుడే గెలుపొందాం. మేం టాస్ గెలిస్తే ఆబ్వియస్లీ బౌలింగ్ ఎంచుకుంటాం. ఒకవేళ మేము టాస్ ఓడిపోతే ఏమాత్రం నిరాశచెందాం. మేము మొదట బ్యాటింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం' అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక విలేకరుల సమావేశంలో అన్నారు.

మాకు ఒకానొక అత్యుత్తమ ఆసియాకప్ టోర్నీ ఇది
'ఒక జట్టుగా మేము ఫైనల్ ఆడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం. పాకిస్తాన్ చాలా మంచి జట్టు. మేం ఆడిన అన్ని మ్యాచ్‌లు కూడా నెయిల్‌బైటర్‌గా ఉన్నాయి. ఒక టోర్నమెంట్‌గా వెనక్కి తిరిగి చూస్తే.. ఇది మా జట్టు కలిగి ఉన్న అత్యుత్తమ ఆసియా కప్ టోర్నీలో ఒకటి అని చెప్పుకోవచ్చు. మేము ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాం.' అని షనక తెలిపాడు. ఇకపోతే శుక్రవారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో శ్రీలంక 5వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ఆతిథ్య శ్రీలంక కేవలం 121 పరుగులకే పాకిస్థాన్‌ను కట్టడి చేసింది. వనిందు హసరంగా మూడు వికెట్లు తీయగా, మహేశ్ తీక్షణ, ప్రమోద్ మదుషన్ చెరో రెండు వికెట్లు తీశారు. శ్రీలంక 122పరుగుల లక్ష్యాన్ని 17ఓవర్లలోనే ఛేదించింది. పాతుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీతో అలరించాడు. భానుక రాజపక్స, దసున్ షనక చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications