
దీపక్ హుడాకు ఛాన్స్ కష్టమే
ఇషాంత్.. జతిన్ సప్రూ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. 'దీపక్ హుడాకు తుది జట్టులో చోటు దక్కడం కష్టమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే విరాట్ కోహ్లీ నంబర్ 3లో తప్పకుండా ఆడతాడు. కోహ్లీ అందుబాటులో ఉంటే అతను ఆడకపోవడం అంటూ ఉండదు. అతన్ని బెంచ్‌కు పరిమితం చేయడం కుదరని పని. ఇదే నిజం' అని ఇషాంత్ దీపక్ హుడాకు ఛాన్స్ దక్కే అవకాశాలు లేవని స్పష్టం చేశాడు.

హార్దిక్, దినేష్ లాగే రవీంద్రా జడేజా కూడా..
ఇక తొలి మ్యాచ్‌లో ఆడిన అక్షర్ పటేల్ స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తుది జట్టులోకి వస్తాడని ఇషాంత్ అన్నాడు. 'అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా ప్లేయింగ్ 11లోకి రావాలి. అతను హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ లాగా బంతిని హిట్ చేసే ప్లేయర్.' అని పేర్కొన్నాడు. ఇక ఇటీవల రీషెడ్యూల్డ్ చేసిన అయిదో టెస్టులో రవీంద్రా జడేజా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.

శ్రేయస్ కన్నా సూర్యకుమార్ యాదవే బెటర్
ఇక నంబర్ 4 స్థానం గురించి మాట్లాడుతూ.. 'సూర్యకుమార్ యాదవ్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు తుది జట్టులో ఉంటాడనుకుంటున్నా. శ్రేయాస్ అయ్యర్ కంటే 4వ స్థానంలో ఆడ్డానికి సూర్యనే బెటర్ అని నేను భావిస్తున్నాను. ఇక మొత్తంగా తుది జట్టులోకి అయిదుగురు ఇన్‌కమింగ్ ప్లేయర్లు రావొచ్చు.' అని ఇషాంత్ అభిప్రాయపడ్డాడు. ఇక తొలి టీ20లో సూర్య 39పరుగులతో రాణించి.. జట్టుకు మిడిల్ ఓవర్లలో మంచి స్కోరు అందించాడు.

2వ, 3వ టీ20లకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్


Click it and Unblock the Notifications












