Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అన్నీ బాగుంటేనే దేవుడిగా చూస్తారు.. లేదంటే నెత్తిన రాళ్లేస్తారు: రోహిత్ శర్మ

Rohit Sharma: రోహిత్ శర్మ.. పరిచయం అక్కర్లేని పేరు. అభిమానులు అతన్ని హిట్ మ్యాన్‌గా పిలుచుకుంటారు. క్రికెట్‌లో భారత్‌కు ఉన్న ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోన్న జట్టు సారథి. అంతర్జాతీయ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తోన్న డాషింగ్ ఓపెనర్. 17 సంవత్సరాల కిందట అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. కేప్టెన్ స్థాయికి ఎదిగాడు.

ఈ 17 సంవత్సరాల క్రికెట్ ప్రయాణంపై స్పందించాడు రోహిత్ శర్మ. దుబాయ్‌ ఐ 103.8 వెబ్‌సైబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తన కేరీర్‌కు సంబంధించిన అనేక అంశాలను స్పృశించాడు. క్రికెట్‌లో ఈ స్థాయి ఎదుగుదలకు కారణమైన విషయాల గురించి వివరించాడిందులో.

if things not going your way they have pelted stones at your houses says Rohit Sharma

తాను ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల రోల్ చాలా ఉందని, వారే తనను ప్రోత్సహించారని రోహిత్ శర్మ చెప్పాడు. తన కేరీర్ అత్యున్నత స్థితికి చేరుకున్నప్పుడూ పతనావస్థలో ఉన్నప్పుడూ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం మరిచిపోలేనిదని అన్నాడు.

క్రికెట్ తన సర్వస్వం అని వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ. క్రికెట్ జర్నీ ఇప్పుడు 17 సంవత్సరాలకు చేరుకుందని, ఈ అద్భుత ప్రయాణానికి ఇక్కడితో పుల్ స్టాప్ పెట్టాలనుకోవట్లేదని అన్నాడు. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు క్రికెట్‌ ఆడాలని కోరుకుంటోన్నట్లు చెప్పాడు.

జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం అనేది తనకు లభించిన అతి పెద్ద గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు రోహిత్. టీమిండియా సారథిగా తాను పగ్గాలను స్వీకరిస్తానని తాను ఏ రోజు అనుకోలేదని, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించనే లేదని పేర్కొన్నాడు. మంచి వ్యక్తులకు ఎప్పుడూ మంచి జరుగుతుంది అనే పెద్దలు చెబుతుంటారు.. దానికి ఉదాహరణే నా కేప్టెన్సీ అని చెప్పాడు.

if things not going your way they have pelted stones at your houses says Rohit Sharma

జట్టు సభ్యులందరినీ ఏకతాటిపైకి తీసుకుని రావాలని, అప్పుడే విజయాలను సాధించగలుగుతానని టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు భావించానని, దాన్ని చేతల్లో చూపించగలిగానని రోహిత్ అన్నాడు. ఇది తన కేరీర్‌లో ఓ ల్యాండ్‌మార్క్‌గా మిగిలిపోతుందని చెప్పాడు.

వ్యక్తిగత రికార్డుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, మ్యాచ్ ఆడే తుదిజట్టును ఏకతాటిపైకి తీసుకుని రావడం- మ్యాచ్‌ను గెలవడం అనేది తన లక్ష్యంగా సాగిందని వివరించాడు. భారతీయులు క్రికెట్‌ను ఎంతగానో ఆరాధిస్తారని, యూరప్‌లో ఫుట్‌బాల్‌కు మించి 10 రెట్లు ఎక్కువగా ఆదరిస్తారని పేర్కొన్నాడు.

పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అందరి దృష్టిలో మంచివాడిగా కనిపిస్తారని, అందరూ దేవుడిలా ఆరాధిస్తారని రోహిత్ శర్మ చెప్పాడు. ప్రతికూలంగా మారినప్పుడు ఇంటిపై రాళ్లు వేయడానికీ వెనుకాడబోరని, ఇలాంటి సంఘటనలను గతంలో తాను చూశాననీ అన్నాడు.

Story first published: Wednesday, May 15, 2024, 14:04 [IST]
Other articles published on May 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+