న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పన్ను మినహాయింపు లేకపోతే ఆ భారం బీసీసీఐ మోయాల్సిందే

BCCI To Carry Burden For Global Events If There Is No Tax Exemption, Says ICC | Oneindia Telugu
If there is no tax exemption, BCCI will have to carry burden for global events

హైదరాబాద్: భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈవెంట్ల నిర్వహణ సమయంలో నిబంధనల ప్రకారం వాటికి సంబంధించి పన్ను చెల్లించే బాధ్యత బీసీసీఐదేనని ఐసీసీ స్పష్టం చేసింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2021 టీ20 వరల్డ్‌కప్‌, 2023 వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.

క్రీజులో ధోని ఉంటే చాలు... ఆ ఆత్మవిశ్వాసమే వేరు: కేదార్ జాదవ్క్రీజులో ధోని ఉంటే చాలు... ఆ ఆత్మవిశ్వాసమే వేరు: కేదార్ జాదవ్

ఐసీసీ మెగా ఈవెంట్లు నిర్వహించినప్పుడు సభ్య దేశాల నుంచి ఐసీసీకి పన్ను మినహాయింపు లభిస్తోంది. అయితే, 2016లో భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఐసీసీకి పన్ను మినహాయింపులు లభించలేదు. దీంతో ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోతే బీసీసీఐనే ఆ భారాన్ని మోయాలని ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

ఇతర క్రికెట్‌ దేశాల్లో ఇస్తున్నట్లుగా

ఇతర క్రికెట్‌ దేశాల్లో ఇస్తున్నట్లుగా

ఇతర క్రికెట్‌ దేశాల్లో ఇస్తున్నట్లుగా భారత క్రికెట్ బోర్డుకు ప్రత్యేకంగా భారత ప్రభుత్వం ఐసీసీ మెగా ఈవెంట్లకు మినహాయింపు ఇవ్వడం లేదు. దీంతో పన్ను మినహాయింపు అదనపు భారాన్ని మోసేందుకు తమ స్పాన్సర్లతో బీసీసీఐ చర్చలు జరుపుకోవాలని ఆదివారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ముందస్తుగా సూచించారు.

బీసీసీఐ విజ్ఞప్తిని తొసిపుచ్చిన ఐసీసీ

బీసీసీఐ విజ్ఞప్తిని తొసిపుచ్చిన ఐసీసీ

దీంతో పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలతో క్రికెట్‌ సంబంధాలు నిలిపివేయాలని బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తోసిపుచ్చింది. ఉగ్రవాద సంబంధ అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదని ఐసీసీ స్పష్టం చేసింది.

బీసీసీఐ రాసిన లేఖపై స్పందించిన ఐసీసీ

బీసీసీఐ రాసిన లేఖపై స్పందించిన ఐసీసీ

గత నెలలో జరిగిన పుల్వా మా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడికి కారణమైన వారిని క్రికెట్ నుంచి బహిష్కరించాలని, వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దంటూ బీసీసీఐ రాసిన లేఖకు ఐసీసీ తాజాగా స్పందించింది.

పాక్‌పై బహిష్కరణ వేటు వేయలేం

పాక్‌పై బహిష్కరణ వేటు వేయలేం

"జరిగిన ఉదంతాన్ని కారణంగా చూపుతూ సభ్య దేశంపై బహిష్కరణ వేటు వేయలేం. ఓ దేశాన్ని వెలివేయడమనేది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని, అందులో ఐసీసీ పాత్రేమీ ఉండదని ఛైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ స్పష్టం చేశారు. ఈ విషయం బీసీసీఐకి కూడా తెలుసు" అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.

Story first published: Monday, March 4, 2019, 13:21 [IST]
Other articles published on Mar 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X