Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: వర్షంతో భారత్, జింబాబ్వే మ్యాచ్ రద్దు అయితే..?

If the match between India and Zimbabwe is canceled due to rain, there is a chance for India to go to the semis

టీ20 వరల్డ్ కప్ 2022లో భారత్ ఆదివారం జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ జింబాబ్వేను ఓడిస్తే సెమీస్ కు వెళ్లడం లాంఛనమే అవుతుంది. ఒక వేళ ఓడిపోతే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. అయితే మెల్ బోర్న్ లో జరగబోయే ఇండియా, జింబాబ్వే మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ వర్షం కురిసి రద్దు అయితే భారత్ సెమీస్ కు వెళ్తుందా లేక పాకిస్థాన్ వెళ్తుందో చూద్దాం..

6 పాయింట్లతో
గ్రూప్-2లో భారత్ నాలుగు మ్యాచ్ ల్లో 3 మ్యాచ్ ల్లో విజయం సాధించి ఒక మ్యాచ్ లో ఓడిపోయి 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. సౌతాఫ్రికా నాలుగు మ్యాచ్ ల్లో 2 మ్యాచ్ ల్లో విజయం సాధించి, ఒక మ్యాచ్ లో ఓడిపోయి, ఒక మ్యాచ్ రద్దు కావడంతో 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి.. మరో రెండు మ్యాచ్ ల్లో గెలిచి 4 పాయింట్లతో మూడు స్థానంలో ఉంది.

వర్షం కారణంగా భారత్, జింబాబ్వే మ్యాచ్ రద్దు అయితే చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు భారత్ 7 పాయింట్లతో ఉంటుంది. పాకిస్థాన్ తమ తర్వాతి మ్యాచ్ ల్లో గెలిచినా భారత్ సెమీస్ కు వెళ్లడం ఖాయం అవుతుంది.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా
నెదర్లాండ్స్ పై సౌతాఫ్రికా ఓడిపోయి.. పాకిస్థాన్ బంగ్లాదేశ్ పై గెలిస్తే అప్పుడు పాక్ సెమీస్ కు వెళ్తుంది. నెదర్లాండ్స్ పై దక్షిణాఫ్రికా గెలిస్తే పాకిస్థాన్ బంగ్లాదేశ్ పై గెలిచినా ఫలితం ఉండదు. సో వర్షం కురిసి మ్యాచ్ రద్దు అయినా భారత్ కు వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఒక వేళ భారత్ జింబాబ్వే ఓడిపోతే అప్పుడు రన్ రేట్ ఆధారంగా సెమీస్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.

ఇక గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్ సెమీస్ కు వెళ్లడం ఖాయమైంది. ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య పోటీ నెలకొంది. శ్రీలంకపై ఇంగ్లాండ్ గెలిస్తే సెమీస్ కు వెళ్తుంది. లేకుంటే ఆస్ట్రేలియా సెమీస్ కు వెళ్తుంది.

Story first published: Saturday, November 5, 2022, 13:40 [IST]
Other articles published on Nov 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+