Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డే/నైట్ టెస్టులో బంతి తడిస్తే: మంచు ప్రభావంపై డీన్‌ జోన్స్‌ విచిత్రపు సలహా

If the ball gets wet, just change it: Dean Jones on dew factor in Day/Night Tests

హైదరాబాద్: భారత్ తొలి డే/నైట్ టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. నవంబర్ 22 నుంచి భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టుకు మంచు ప్రభావం చూపే అవకాశం ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ ఓ సలహా ఇచ్చాడు.

గులాబి బంతి తడిస్తే కొత్తది తీసుకుంటే సరిపోతుందని చెప్పాడు. ఈ సందర్భంగా డీన్ జోన్స్ మాట్లాడుతూ "డే/నైట్‌ టెస్టు గొప్ప ముందడుగు. మంచు ప్రభావం గురించి తప్పక ఆలోచించాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ బంతి తడిస్తే కొత్త బంతిని తీసుకోండి" అని డీన్‌ జోన్స్‌ వెల్లడించాడు.

"ఆట నిబంధనలు మారుతున్నాయి. ఉదాహరణకు బ్రాడ్‌మన్‌ కాలంలో ఒక జట్టు 200 పరుగులు చేస్తే రెండో కొత్త బంతి ఇచ్చేవారు. మనం రాత్రిపూట ఆడుతున్నాం. ఒకవేళ బంతి తడిస్తే మార్చేయండి. నా దృష్టిలోనైతే ఇది తేలికైన పని. సౌరవ్‌ గంగూలీ టెస్టు క్రికెట్‌తో పాటు రాత్రిపూట క్రికెట్‌కు అభిమాని అని తెలుసు" అని డీన్‌ జోన్స్‌ పేర్కొన్నాడు.

"రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంతా గులాబి టెస్టులదే. ప్రస్తుతం ప్రజలు బిజీగా గడుపుతున్నారు. గులాబి టెస్టులకు ఆస్ట్రేలియాలో రేటింగ్స్‌ బాగున్నాయి. సంప్రదాయ టెస్టులతో పోలిస్తే ఎంత భారీస్థాయిలో ఉన్నాయో చెప్పలేను. బిజీగా ఉండటంతో పగటి పూట టెస్టు క్రికెట్‌ చూడటం జనాలకు కష్టమవుతోంది. గులాబి బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. అలవాటు పడితే సులభంగానే ఉంటుంది" అని జోన్స్‌ అన్నాడు.

Story first published: Saturday, November 2, 2019, 7:52 [IST]
Other articles published on Nov 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+