For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shreyas Iyer: IPL 2021కు సిద్ధం.. కెప్టెన్సీ గురించి నాకు తెలియదు! అది మేనేజ్మెంట్ ఇష్టం!

If Shreyas Iyer returns for IPL 2021 will Rishabh Pant continue as Delhi Capitals captain
IPL 2021 : Shreyas Iyer Opens Up On IPL 2021 Return And His Captaincy || Oneindia Telugu

ఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మొదటి దశకు పూర్తిగా దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని తెలిపాడు. యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నట్లు శ్రేయస్ స్పష్టం చేశాడు. అయితే కెప్టెన్సీ గురించి మాత్రం తనకు తెలియదన్నాడు. యూఏఈలో సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభం కానుందని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

 కోలుకున్న అయ్యర్:

కోలుకున్న అయ్యర్:

ఐపీఎల్‌ 2021 ముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో శ్రేయస్‌ అయ్యర్ భుజానికి తీవ్ర గాయమైంది. మార్చి 26న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో అయ్యర్ ఎడమ భుజానికి గాయమైంది. ఆపై జట్టుకు దూరమయి.. ఏప్రిల్‌ 8న భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 120 నుంచి 150 రోజులు పట్టనుందని అప్పుడే డాక్టర్లు తేల్చేశారు. దీంతో ఐపీఎల్ 2021 మొదటి దశ మ్యాచులకు దూరమయ్యాడు. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌‌కు ఢిల్లీ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. అయితే తాజాగా అయ్యర్.. తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించాడు.

 కెప్టెన్సీ గురించి నాకు తెలియదు:

కెప్టెన్సీ గురించి నాకు తెలియదు:

శ్రేయస్‌ అయ్యర్ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ... 'నా భుజ గాయం పూర్తిగా నయమైంది. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే పనిలో ఉన్నాను. అందుకు సంబంధించి ట్రెయినింగ్‌ కూడా మొదలుపెట్టాను. దానికి మరో నెల రోజుల సమయం పడుతుంది. ఐపీఎల్‌ 2021కు చాలా సమయం ఉంది. టోర్నీలో ఆడతాననే నమ్మకం ఉంది. అయితే నేను ఆడినప్పుడు కెప్టెన్సీ చేస్తానా లేదా అనే విషయం నాకు తెలియదు. అది జట్టు యాజమాన్యం చేతుల్లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతంగా ఆడుతోంది. టాప్‌లో నిలిచింది. నాకు అదే ముఖ్యం. నా లక్ష్యం మేం కప్పు సాధించడమే' అని అన్నాడు.

అశ్విన్‌ను ఒప్పించడం కష్టమైంది:

అశ్విన్‌ను ఒప్పించడం కష్టమైంది:

ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను మన్కడింగ్‌ చేయకుండా ఒప్పించే విషయంపై శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. 'అశ్విన్‌ భాయ్ ఢిల్లీ జట్టులో చేరినప్పుడు మన్కడింగ్‌ చేయకుండా ఒప్పించే విషయం చాలా కష్టమైంది. మన్కడింగ్‌ చేయడానికి ఢిల్లీ జట్టు వ్యతిరేకమని నేనూ, మా కోచ్ రికీ పాంటింగ్‌ అతడికి చెప్పి చూసాం. దాంతో మేం చెప్పినదానికి కట్టుబడి ఉంటానన్నాడు. అయితే మేం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తూనే ఓ మెలిక పెట్టాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ అతి చేయనంతవరకు మాత్రమే.. అలా చేయనని మాకు మాటిచ్చాడు' అని శ్రేయస్‌ తెలిపాడు.

శ్రేయాస్ తిరిగి వచ్చినా:

శ్రేయాస్ తిరిగి వచ్చినా:

ఐపీఎల్ 14వ సీజన్‌లో రిషబ్‌ పంత్‌ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతంగా రాణించింది. లీగ్ వాయిదాపడే సమయానికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆడిన 8 మ్యాచుల్లో ఢిల్లీ 6 విజయాలు అందుకుంది. ఈ నేపథ్యంలో పంత్‌ను కాదని శ్రేయాస్ అయ్యర్‌కు తిరిగి జట్టు పగ్గాలు అప్పజెప్పుతారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే శ్రేయాస్ తిరిగి వచ్చినా పంత్ ఢిల్లీ కెప్టెన్‌గా కొనసాగుతాడని సమాచారం తెలుస్తోంది. ఇక అయ్యర్ స్థానంలో ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు స్టీవ్ స్మిత్ జట్టులోకి వచ్చాడు. తాజాగా స్మిత్ ఐపీఎల్ రెండో దశకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

Story first published: Tuesday, July 6, 2021, 12:56 [IST]
Other articles published on Jul 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+