
షాహీన్ అఫ్రిదిని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొండెక్కించాడు. అతనంతటి బౌలరే లేదన్నట్లు తెగ పొగిడేశాడు. షాహీన్ షా ఆఫ్రిది ఐపీఎల్ వేలంలో ఉండుంటే రూ.14 నుంచి రూ.15కోట్ల మేర ధర పలికేవాడని అశ్విన్ పేర్కొన్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ టైంలో భారత టాపార్డర్ వికెట్లు తీసిన షాహీన్ ఆఫ్రిది.. భారత్ మ్యాచ్ ఓడిపోవడానికి కీలక కారణమయ్యాడు. ఇకపోతే 22ఏళ్ల షాహీన్ అఫ్రిది గాయం కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీకి దూరమయ్యాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌లో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. షాహీన్ అఫ్రిది లేకపోవడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాడు.
గతేడాది టీ20 మ్యాచ్‌లో షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్ బానే బౌలింగ్ చేసినప్పటికీ.. షాహీన్ అఫ్రిది టఫ్ పేస్ మాత్రం మేము మ్యాచ్ కోల్పోయేలా చేసింది. ఈసారి అతను మిస్ కావడం పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ. నేను ఐపీఎల్ వేలంలో షాహీన్ అఫ్రిది ఉంటే ఎంత క్రేజీగా ఉండేదో అని నేను ఓసారి ఆలోచించాను. కొత్త బంతితో తొలి స్పెల్‌లో అతను బౌలింగ్ వేసే నైపుణ్యం.. డెత్‌లో యార్కర్‌లు వేసే అతని సామర్థ్యం అద్భుతం. ఐపీఎల్ మెగావేలంలో అతను గనుక పాల్గొని ఉండుంటే.. రూ.14-15 కోట్లకు అతన్ని జట్లు కొనుక్కునేవి కావొచ్చు. ఈ మ్యాచ్‌కు ఆఫ్రిది లేనప్పటికీ పాక్ బౌలర్లు నిలకడగా గంటకు 140-145 కి.మీ వేగంతో వేయగలరు. పాకిస్తాన్ జట్టు పేస్ అటాక్‌కు తగినంత ఫైర్‌పవర్ ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ జట్టుకూ ఇంత గొప్ప ఫాస్ట్ బౌలర్ల బ్యాకప్ ఉందని నేను అనుకోను.' అని రవిచంద్రన్ అశ్విన్ కొనియాడాడు.
ఇకపోతే అశ్విన్.. మరి అంతగా షాహీన్ అఫ్రిదిని పొగడడం ఏంటో అర్థం కాలేదు. బుమ్రా, భువీ, షమీ ముందు షాహీన్ అఫ్రిది ఏపాటి బౌలర్. ఐపీఎల్లో షాహీన్ అఫ్రిదికి అంత క్రేజు ఉందంటూ అతన్ని హైప్ చేయడం అనవసరమని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇకపోతే మరికొద్ది సేపట్లో రచ్చ రంభోలా లాంటి ఇండియ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది.