Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారతరత్న కావాలంటే సచిన్ టెండూల్కర్‌కు షరతు

Sachin Tendulkar
భోపాల్: భారతరత్న కావాలంటే భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) వదిలేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపియల్‌లో ఆడడం మానేస్తేనే భారతరత్నకు సచిన్ పేరును పరిశీలిస్తారని ఆయన అన్నారు. సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాడు కూడా కొనుగోలు, అమ్మకం వ్యవహారంలో భాగమైతే బాధగా ఉంటుందని ఆయన అన్నారు. క్రీడాకారుడు దేశం కోసం ఆడుతాడు గాని కంపెనీల కోసం కాదని ఆయన అన్నారు. గత రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

ఐపియల్ ఆటను పాడు చేస్తోందని చౌహాన్ నిందించారు. టెండూల్కర్ అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు అయినప్పటికి క్రీడావిభాగానికి సంబంధించి తొలి భారతరత్న అవార్డు హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్‌కు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+