'ద్రవిడ్ ఫ్రీ అయితే అతడి సహకారం తీసుకోవడానికి సిద్ధమే'
హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి చెప్పాడు. గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) విదేశీ పర్యటనలు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కన్సల్టెంట్‌గా జహీర్ ఖాన్ పేరుని సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి గురువారం మీడియాతో మాట్లాడాడు. 'రాహుల్ బోర్టులో ఉంటే ఎంత ప్రయోజనమో అందరికీ తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ సంసిద్ధత తోపాటు అతడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడో బీసీసీఐకి తెలియాలి. తగిన సమయం కేటాయిస్తానంటే.. అతడి సహకారం తీసుకోవడానికి సిద్ధమే' అని రవిశాస్త్రి చెప్పాడు.

ఇక బౌలింగ్ కన్సల్టెంట్‌గా జహీర్ ఖాన్‌తో కూడా కలసి పనిచేయడానికి తనకు ఎటువంటి ఇబ్బందీ లేదని అన్నాడు. 'జహీర్, రాహుల్‌కు ఎంతో అనుభవం ఉంది. వారిని అగౌరవ పరచాలనే ఉద్దేశం తనకు ఏ కోశానా లేదు' అని రవిశాస్త్రి చెప్పాడు. 2019లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో కన్సల్టెంట్స్‌ను ఆహ్వానించడానికి తగిన ప్రణాళిక అవసరమన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications