న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సకాలంలో నామినేషన్‌ను పంపించి ఉంటే ఖేల్‌ రత్నను గెలుచుకునేవాణ్ణి

Harbhajan Singh Comments On Rajiv Gandhi Khel Ratna Award || Oneindia Telugu
If Punjab government had sent my nomination on time I won Rajiv Gandhi Khel Ratna award says Harbhajan Singh

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలకు భారత స్టార్ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌, టీమిండియా సీనియర్‌ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ నామినేషన్లను కేంద్ర క్రీడా శాఖ తిరస్కరించిన విషయం తెలిసిందే. అర్జున అవార్డుకు ద్యుతీచంద్‌, ఖేల్‌రత్న అవార్డుకు హర్భజన్‌ సింగ్‌ నామినేషన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గడువు ముగిసిన తర్వాత దాఖలు చేయడంతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) తిరస్కరించింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

అవార్డు లభించదు:

అవార్డు లభించదు:

తాజాగా హర్భజన్‌ ఓ వీడియోనూ చిత్రీకరించి తన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో హర్భజన్‌ మాట్లాడుతూ... 'రాజీవ్‌ గాంధీ ఖేల్ రత్న పురస్కారం కోసం పంజాబ్‌ ప్రభుత్వం వేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురైందని మీడియా ద్వారా తెలిసింది. నామినేషన్‌ను ఆలస్యంగా పంపడంతో కేంద్రం దాన్ని వెనక్కి పంపింది. నాకు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ సంవత్సరం నాకు అవార్డు లభించదు' అని హర్భజన్‌ అన్నారు.

సకాలంలో నామినేషన్‌ పంపించి ఉంటే:

సకాలంలో నామినేషన్‌ పంపించి ఉంటే:

'ఆలస్యం ఎందుకు జరిగిందనే దానిపై దర్యాప్తు చేయాలని పంజాబ్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిని విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. మార్చి 20 నాటికి నా నామినేషన్‌ తాలుకు వివరాలన్నీ ఇచ్చేశా. అయినా ఆలస్యం అయింది. ప్రతి ఆటగాడికి ప్రోత్సాహమనేది చాలా ముఖ్యం. ఇలాంటి ఘటనల వల్ల క్రీడల మీద ఆసక్తి తగ్గడంతో పాటు ప్రభుత్వంపై నమ్మకం పోతుంది. సకాలంలో నామినేషన్‌ను పంపించి ఉంటే అవార్డును గెలుచుకునేవాణ్ణి' అని హర్భజన్‌ వీడియోలో తెలిపాడు.

తిరిగి పంపించాలని కోరా:

తిరిగి పంపించాలని కోరా:

నామినేషన్‌ తిరస్కరణకు గురవడంపై మూడు రోజుల క్రితమే ద్యుతీ చంద్ ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను కలిసింది. 'సీఎం నవీన్ పట్నాయక్‌ను కలిశా. ఇటలీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో నేను గెలిచిన స్వర్ణ పతాకాన్ని ఆయనకు చూపించా. నా ఫైల్‌ను తిరిగి పంపించాలని కోరా. అందుకు ఆయన ఓకే అన్నారు. రాబోయే పోటీలకు సిద్ధమవ్వాలని సీఎం సూచించారు' అని ద్యుతీ చంద్ పేర్కొన్నారు.

Story first published: Wednesday, July 31, 2019, 13:46 [IST]
Other articles published on Jul 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X