న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో జరిగే క్రికెట్ పోటీలలో భారత్‌ను బహిష్కరిస్తే నష్టపోయేది పాకిస్థానే అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా శనివారం అన్నాడు.
డిసెంబరులో తమతో ఆడాల్సిన సిరీస్ నుంచి భారత్ తప్పుకుంటే, ఐసీసీ టోర్నీల్లో భారత్‌తో మేం ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లనూ బహిష్కరిస్తామని అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ షహర్యార్ ఖాన్ హెచ్చరించాడు.
దీనిపై రాజీవ్ శుక్లా ఘాటుగా స్పందించాడు. షహర్యార్ తన వ్యాఖ్యలతో బిసిసిఐని బెదిరిస్తున్నాడా? లేదా ఐసిసిని బెదిరిస్తున్నాడా? అని ప్రశ్నించాడు. ఐసీసీ నిబంధనలకు పాకిస్థాన్ కట్టుబడి ఉండాల్సిందేనని, లేకుంటే, జరిమానాకు గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించాడు.

భద్రత కారణాల వల్లే పాకిస్థాన్ లో ఏ జట్టూ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడటం లేదని గుర్తు చేశాడు. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌ను బహిష్కరిస్తే పాకిస్థాన్‌కే నష్టమన్నాడు. పాకిస్తాన్‌లో మ్యాచ్ ఆడిదే... ఆటగాళ్లకు పిసిబి గ్యారెంటీ ఇవ్వగలదా అని నేను అడుగుతున్నానన్నాడు.
సెక్యూరిటీ కారణాల వల్లనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, చివరకు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్‌లో పర్యటించలేదని గుర్తు చేశాడు. పాకిస్తాన్‌తో సిరిస్ ఫైనల్ అయ్యాక, తాము ప్రభుత్వం అనుమతి కోసం వెళ్తామని చెప్పాడు. అయితే, సిరీస్‌ల కంటే ముందు... ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నాయన్నాడు. దీంతో, డిసెంబర్ నెలలో సిరీస్‌కు అవకాశం లేదన్నాడు.