Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్‌: టీమిండియాను ఓడించితే.. పాక్ క్రికెట్లకు బ్లాంక్ చెక్ ఆఫర్: ఎవరా పారిశ్రామికవేత్త?

 If Pakistan beats India in the T20 World Cup, a blank cheque is ready for the PCB, says Ramiz Raja

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు వచ్చింది. ఈ సాయంత్రం నిర్వహించే రెండు మ్యాచులతో లీగ్ దశ ముగుస్తుంది. ఆది, సోమ, బుధవారాల్లో ప్లేఆఫ్స్ ఉంటాయి. 15వ తేదీన ఫైనల్. ఈ మ్యాచ్ ముగిసిన రెండో రోజే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభమౌతుంది. తొలిదశలో క్వాలిఫయర్ మ్యాచ్‌లను నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అదే సమయంలో 18, 20వ తేదీల్లో వార్మప్ మ్యాచ్‌లను నిర్వహిస్తుంది.

వార్మప్ తరువాతే..బిగ్ ఫైట్

వార్మప్ తరువాతే..బిగ్ ఫైట్

టీమిండియా సహా పెద్ద జట్లన్నీ వార్మప్ మ్యాచ్‌లను ఆడతాయి. రెండేసి మ్యాచుల్లో తలపడతాయి. 18వ తేదీన నిర్వహించే వార్మప్ మ్యాచ్‌లల్లో ఆఫ్ఘనిస్తాన్-దక్షిణాఫ్రికా, పాకిస్తాన్-వెస్టిండీస్, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, భారత్-ఇంగ్లాడ్ మధ్య పోరు ఉంటుంది. 20వ తేదీ నాటి మ్యాచ్‌లల్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్, భారత్-ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా-పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్-వెస్టిండీస్ తలపడతాయి. క్వాలిఫయర్స్ పూర్తయిన వెంటనే అసలు సిసలు టోర్నమెంట్ మొదలవుతుంది.

చిరకాల ప్రత్యర్థితో..

చిరకాల ప్రత్యర్థితో..

విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు.. తన మొట్టమొదటి మ్యాచ్‌లోనే కఠిన ప్రత్యర్థిని ఎదుర్కొనబోతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడబోతోంది. సూపర్ 12లో భాగంగా 16వ మ్యాచ్‌గా భారత్-పాకిస్తాన్ పోటీలో ఉంటాయి. దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ నెల 31వ తేదీన తన తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌, నవంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్‌లు ఉంటాయి. 5వ తేదీన బీ1, 8న ఏ2తో మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.

అంచనాలు ఆకాశానికి

అంచనాలు ఆకాశానికి

భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అనగానే.. దాని మీద ఎలాంటి అంచనాలు ఉంటాయనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని విషయం. రెండు దేశాలకు చెందిన కోట్లాదిమంది అభిమానులు, ప్రజల మనోభావాలతో ముడి పడి ఉంటుంది ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్. అందులోనూ ఐసీసీ వంటి మెగా క్రికెట్ టోర్నమెంట్లలో చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొంటోందంటే- దాని మీద అంచనాలు ఆకాశానికి అంటుతుంటాయి. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా భారత్‌ను ఓడించలేదు పాకిస్తాన్.

గెలవలేని పాకిస్తాన్..

గెలవలేని పాకిస్తాన్..

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో కూడా పాకిస్తాన్ చేతిలోఇప్పటిదాకా ఒక్కసారి కూడా టీమిండియాను ఓడిపోలేదు. ఈ వేదికపై అయిదు సార్లు ఈ రెండు జట్లు ఎదురెదురు పడ్డాయి. 2007 సెప్టెంబర్ 14వ తేదీన దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన తొలి మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తరువాత నాలుగు సార్లు భారత్ గెలిచింది. పాకిస్తాన్‌పై టీమిండియా అత్యధికంగా 157 పరుగులు, అత్యల్పంగా 119 పరుగులు చేసింది. పాకిస్తాన్.. భారత జట్టుపై అత్యధికంగా 152, అత్యల్పంగా 118 పరుగులు చేసింది.

బ్లాంక్ చెక్..గిఫ్ట్

బ్లాంక్ చెక్..గిఫ్ట్

ఇప్పుడు ఆ రికార్డును చెరిపేయాలనే పట్టుదలను పాకిస్తాన్ ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును మట్టి కరిపించగలిగితే ఓ బ్లాంక్ చెక్‌ను ఈనామ్‌గా అందుకోనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా స్వయంగా వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన భారత్‌ను ఎదుర్కొనే మ్యాచ్‌లో తమ జట్టు విజయం సాధించితే- గిఫ్ట్‌గా బ్లాంక్ చెక్ ఇస్తానని, దాని మీద ఎంత మొత్తమైనా రాసుకోవచ్చని ఓ బడా పారిశ్రామికవేత్త తనకు ఆఫర్ ఇచ్చినట్లు రమీజ్ రాజా తెలిపారు.

అన్ని వివరాలు అప్పుడే..

అన్ని వివరాలు అప్పుడే..

ఈ బ్లాంక్ చెక్‌ను అందిస్తానని ఆఫర్ ఇచ్చిన ఆ పెట్టబడిదారుడి పేరును వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు. దాని గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు అప్రస్తుతమని స్పష్టం చేశారు. అక్టోబర్ 24వ తేదీన భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ తరువాత.. అన్ని వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. దీనికోసం పాకిస్తాన్ గెలవాల్సి ఉందని పేర్కొన్నారు. బాబర్ ఆజమ్ సారథ్యంలోని తమ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్‌లల్లో పకడ్బందీగా ఉందని, ఎలాంటి ప్రత్యర్థినయినా ఓడించగలుగుతుందని అన్నారు.

Story first published: Friday, October 8, 2021, 14:51 [IST]
Other articles published on Oct 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+