న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరోజు శార్ధుల్ ఠాకూర్ నోబాల్ వేయకుండా ఉండి ఉంటే!

If Not For Shardul Thakur's No-Ball,My Career Was Over : Vijay Shankar || Oneindia Telugu
If not for Shardul Thakurs no-ball, my career was over: Vijay Shankar

హైదరాబాద్: రంజీ క్రికెట్‌లో భాగంగా శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన నోబాల్‌ తన కెరీర్ మలుపునకు కారణమైందని వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ తెలిపాడు. గౌరవ్‌కపూర్‌ నిర్వహిస్తున్న హోస్ట్‌గా వ్యవహారిస్తోన్న 'బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌'లో పాల్గొన్న విజయ్‌ శంకర్ తన క్రికెట్ కెరీర్‌లో చోటు చేసుకున్న రెండు సంఘటనలపై మాట్లాడాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ముందుగా విజయ్ శంకర్ "మొదటి సంఘటన నేను రంజీ ట్రోఫీ ఆడుతుంటే జరిగింది. నేను మా కెప్టెన్‌ లక్ష్య ఛేదనలో ఉన్నాం. మేమిద్దరం బాగా ఆడుతున్న సమయంలో మా కెప్టెన్‌ రనౌటయ్యాడు. ఆ తర్వాత జట్టు ఓటమిపాలైంది. ఈ ఓటమితో నేను కార్నర్ అయ్యాను. అయితే, మా కెప్టెన్‌, కోచ్‌తో ఎలాంటి సమస్య తలెత్తలేదు" అని తెలిపాడు.

ఆ మాటలు నన్ను ఎంతగానో బాధించాయి

ఆ మాటలు నన్ను ఎంతగానో బాధించాయి

"కానీ, బయటివారు మాటలు నన్ను ఎంతగానో బాధించాయి. తమిళనాడు తరఫున ఇదే అతడి చివరి మ్యాచ్‌. దీని తర్వాత ఇంకెప్పుడూ ఇక్కడ ఆడలేడు అని పలువురు క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. దీంతో ఎలాగైనా జట్టులో స్థానం సంపాదించాలని చాలా కష్టపడ్డా" అని విజయ్ శంకర్ తన తొలి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

ఆ బంతికి ఔటై ఉండి ఉంటే

ఆ బంతికి ఔటై ఉండి ఉంటే

"ఈ మ్యాచ్‌లో గనుక ఆ బంతికి ఔటై ఉండి ఉంటే తమిళనాడు తరఫున అదే నా చివరి మ్యాచ్‌ అయ్యి ఉండేది. అయితే, నేను చేసిన 95 పరుగులే తర్వాత ఇండియా-ఏ జట్టుకి ఎంపికయ్యేలా చేశాయి. ఇక అక్కడి నుంచి నా కెరీరే పూర్తిగా మారిపోయింది" అని విజయ్ శంకర్ తెలిపాడు.

ఇంగ్లాండ్‌లో విజయ్ శంకర్

ఇంగ్లాండ్‌లో విజయ్ శంకర్

కాగా, ప్రస్తుతం విజయ్ శంకర్ ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా తరుపున ఎంపికైన 15 మంది జట్టు సభ్యుల్లో ఒకడు. కాగా, టోర్నీకి ముందు మే 25న న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో గాయం కారణంగా విజయ్ శంకర్‌కు చోటు దక్కలేదు.

ముంబైతో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో

ముంబైతో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో

ఇక, రెండో సంఘటన విషయానికి వస్తే "ముంబైతో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో శార్దుల్‌ ఠాకుర్‌ వేసిన ఓ అద్భుతమైన బంతికి నేను బౌల్డ్ అయ్యా. కానీ, అది నోబాల్‌గా కావడంతో నేను బతికిపోయా. ఆ సమయంలో నేను ఐదు పరుగుల వద్ద ఉన్నాను. ఆ నోబాల్‌ తర్వాత 95 పరుగులు సాధించి గెలిపించాను" అని విజయ్ శంకర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, May 27, 2019, 12:23 [IST]
Other articles published on May 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X