Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ జట్టుకు ఇదే చివరి మ్యాచ్- లెక్క తేలేదీ ఈ రోజే..!!

 If New Zealand beat Ireland today, the will become the first team to qualify Semifinals of T20 World Cup.

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంటోంది. సూపర్ 12 మ్యాచ్‌లన్నీ ఒక్కటొక్కటిగా ముగుస్తోన్నాయి. ఎల్లుండితో సూపర్ 12 మ్యాచ్‌లన్నీ ముగుస్తాయి. 9వ తేదీ నుంచి సెమీ ఫైనల్స్ మొదలవుతాయి. ప్రస్తుతం 12 జట్లు సూపర్ 12లో ఆడుతోన్నాయి.

ఇందులో ఆరు జట్లు ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. సెమీఫైనల్స్ చేరే అవకాశం నాలుగు జట్లకు మాత్రమే లభిస్తుంది. సెమీ ఫైనల్స్ చేరే జట్టు ఏదనే లెక్క ఇవ్వాళ్టితో తేలిపోనుంది.

 మిగిలింది ఒక్కొక్కటే..

మిగిలింది ఒక్కొక్కటే..

సెమీ ఫైనల్స్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో ఇవ్వాళ, రేపు జరిగే మ్యాచ్‌లన్నీ అత్యంత కీలకంగా మారాయి. న్యూజిలాండ్-ఐర్లాండ్, ఆస్ట్రేలియా- ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇవ్వాళ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. రేపు ఇంగ్లాండ్.. శ్రీలంకతో తలపడుతుంది. ఆదివారం బ్లాక్ బస్టర్ మ్యాచ్‌లు ఉన్నాయి. నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్-పాకిస్తాన్, భారత్-జింబాబ్వే ఆడనున్నాయి. ఇవన్నీ ఆయా జట్లను సెమీ ఫైనల్స్‌కు చేర్చగలిగేవే.

బ్లాక్ క్యాప్స్‌కు భలే ఛాన్స్..

బ్లాక్ క్యాప్స్‌కు భలే ఛాన్స్..

ఈ మెగా టోర్నమెంట్ సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టే మొట్టమొదటి అవకాశం న్యూజిలాండ్‌కు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవ్వాళ ఆ జట్టు ఐర్లాండ్‌తో ఆడాల్సి ఉంది. ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. అడిలైడ్ ఓవల్ స్టేడియం దీనికి వేదిక. సూపర్ 12లో న్యూజిలాండ్‌కు ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిస్తే- సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టిన తొలి జట్టు అవుతుంది న్యూజిలాండ్. ఇప్పుడున్న ఫామ్, ప్లేయర్ల ఆటతీరు.. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే న్యూజిలాండ్ ఈ ఘనతను సాధించడం సాధ్యమే అనిపించేలా ఉంది.

గ్రూప్ 1లో టాప్‌లో..

గ్రూప్ 1లో టాప్‌లో..

గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ జట్టు నాలుగు మ్యాచ్‌లను ఆడగా రెండింట్లో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 89 పరుగుల తేడాతో ఓడించింది. ఫలితంగా మంచి నెట్ రన్‌రేట్‌ను సాధించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. మూడో మ్యాచ్‌లో శ్రీలంకను 65 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. ఆ తరువాతి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఎదుర్కొన్న న్యూజిలాండ్ తొలి పరాజయాన్ని చవి చూసింది. 20 పరుగుల తేడాతో ఓడింది.

ఐర్లాండ్ అడ్డు..

ఐర్లాండ్ అడ్డు..

ఇవ్వాళ ఐర్లాండ్ అడ్డును తొలగించుకోగలిగితే- ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా న్యూజిలాండ్ నేరుగా సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టగలుగుతుంది. ఓడితే మాత్రం- ఇతర జట్ల నెట్ రన్‌రేట్ మీద దాని ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. ఐర్లాండ్‌కు సెమీస్ చేరే అవకాశాలు లేవు. అందుకే ఎలాంటి అంచనాలు లేకుండా స్వేచ్ఛగా ఆడుతుందా టీమ్. న్యూజిలాండ్ సెమీ అవకాశాలను దెబ్బకొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేని విధంగా ఆడొచ్చు.

 తుదిజట్లల్లో..

తుదిజట్లల్లో..

న్యూజిలాండ్ తుదిజట్టులో- ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిఛెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ఈష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఐర్లాండ్ జట్టులో- పాల్ స్టిర్లింగ్, ఆండీ బల్బిర్నె (కెప్టెన్), లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్/గ్రాహం హ్యూమ్, ఫియోన్ హ్యాండ్, బారీ మెక్‌కార్తీ/కానర్ ఓల్ఫెర్ట్, జోష్ లిటిల్ ఆడొచ్చు.

Story first published: Friday, November 4, 2022, 7:16 [IST]
Other articles published on Nov 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+