For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగు రోజులు అంటే ఫస్ట్ క్లాస్ మ్యాచ్: ఐసీసీ ప్రతిపాదనపై రోహిత్ శర్మ

If its 4 days, it is not a Test match: Rohit Sharma joins Virat Kohli against ICC proposal

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌ ప్రతిపాదనను వ్యతిరేకించే సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 2023 నుంచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు అమలు చేయాలని ఐసీసీ భావిస్తుండగా.. ఇప్పటికే ఈ ప్రతిపాదనను విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, రికీ పాటింగ్, మెక్‌గ్రాత్‌ తప్పుబట్టారు.

తాజాగా, ఈ జాబితాలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా చేరాడు. శుక్రవారం ఓ జాతీయ ఛానెల్‌తో రోహిత్ శర్మ మాట్లాడుతూ "సంప్రదాయ ఫార్మాట్‌లో నాలుగు రోజులే ఉంటే, అది టెస్ట్ మ్యాచ్ కాదు. నాలుగు రోజులు అంటే ఫస్ట్ క్లాస్ మ్యాచ్. అంతే సులభం" అని ఈజీగా తేల్చేశాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) నాలుగు రోజుల టెస్టుల అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోబోమని ఇప్పటికే చెప్పగా, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ ప్రతిపాదన గురించి ఇప్పుడే మాట్లాడటం చాలా తొందర పాటు చర్య అవుతుందని చెప్పారు.

ఐసీసీది తెలివి తక్కువ నిర్ణయం

ఐసీసీది తెలివి తక్కువ నిర్ణయం

ఐసీసీ ప్రతిపాదనపై టీమిండియా మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ "నాలుగు రోజుల టెస్టులను వ్యతిరేకిస్తున్నా. ఐసీసీది తెలివి తక్కువ నిర్ణయంగా భావిస్తున్నా అని అన్నారు. 'ఒక క్రికెటర్‌ నైపుణ్యాన్ని పరీక్షించేదే టెస్టు క్రికెట్‌. సచిన్‌ అన్నట్టు ప్రతి రోజు క్రికెటర్ల ప్రతిభను పరీక్షిస్తుంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు ఉన్న లక్షణాలు, స్వభావాలను చంపేయొద్దు' అని సూచించారు.

మహేలా జయవర్దనే ఇలా

మహేలా జయవర్దనే ఇలా

శ్రీలంక మాజీ కెప్టెన్, ఐసీసీ కమిటీ సభ్యుడు మహేళా జయవర్ధనె పేర్కొన్నారు. 'టెస్టు క్రికెట్‌లో మార్పులేమీ చేయొద్దు. సుదీర్ఘ ఫార్మాట్‌ను లాభసాటిగా మార్చేందుకు డే/నైట్‌ టెస్టుతో ముందడుగు వేశారు. అది మంచి నిర్ణయం. రోజుల సమయాన్ని మాత్రం కుదించొద్దు' అని అన్నారు.

ఇయాన్‌ బోథమ్‌ మాట్లాడుతూ

ఇయాన్‌ బోథమ్‌ మాట్లాడుతూ

ఇంగ్లాండ్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ బోథమ్‌ మాట్లాడుతూ... 'అత్యుత్తమ క్రికెట్‌ ఫార్మాట్‌ను ఒంటరిగా వదిలేయండి. అసలైన క్రికెటర్ల నైపుణ్యం, ధైర్యం, సహనం, సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిజమైన క్రికెట్‌ ఇదే. దాని అలా వదిలేయండి. దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ బాగా ఆడింది. ఐదు రోజుల క్రికెట్‌ను చక్కగా ముగించింది' అని చెప్పుకొచ్చారు.

ఇండియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఐసీఏ) ఇలా

ఇండియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఐసీఏ) ఇలా

ఐసీఏ ప్రెసిడెంట్‌ అశోక్‌ మల్హాత్రా మాట్లాడుతూ "గంగూలీ.. నాలుగు రోజుల టెస్టు ఫార్మాట్‌కు ఒప్పుకోవద్దు. మేము ఐదవ రోజున మరిన్ని ఫలితాలను పొందడం ప్రారంభించాము. ఇప్పుడు, పింక్-బాల్ క్రికెట్ కూడా ఉంది. పింక్‌ బాల్‌ టెస్టును నిర్వహించి కూడా సక్సెస్‌ అయ్యాం. కాబట్టి మీరు తీవ్రమైన మార్పు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆపై వెంటనే ఇంత మార్పు ఏమిటి? మీరు ఎక్కువ టి 20 క్రికెట్‌కు అనుగుణంగా షెడ్యూల్ విండోను తెరవడానికి ప్రయత్నిస్తున్నారా? వరుసగా మార్పులు చేసుకుంటూ పోతే మంచిది కాదు. మనం ఏమైనా షెడ్యూలింగ్‌ విండో కోసం ప్రయత్నిస్తున్నామా?. మనకి సాధ్యమైనంత వరకూ ఎక్కువ టీ20 క్రికెట్‌ను నిర్వహిద్దాం. అంతే కానీ నాలుగు రోజుల టెస్టు వద్దు" అని ప్రశ్నించారు.

కుల్దీప్ యాదవ్ ఇలా

కుల్దీప్ యాదవ్ ఇలా

కుల్దీప్‌ యాదవ్‌ మాట్లాడుతూ... 'అయిదు రోజుల టెస్టుకే నా పూర్తి మద్దతు. సుదీర్ఘ ఫార్మాట్‌ ఎప్పటి నుంచో అయిదు రోజులే ఉంది. సంప్రదాయ ఫార్మాట్‌లో మార్పులు చూడాలనుకోవట్లేదు. ఈ ఫార్మాట్‌ను అలానే కొనసాగించాలి' అని అన్నాడు.

నాలుగు రోజుల టెస్టులకు ఇర్ఫాన్ పఠాన్ మద్దతు

నాలుగు రోజుల టెస్టులకు ఇర్ఫాన్ పఠాన్ మద్దతు

నాలుగు రోజుల మ్యాచ్‌ల ద్వారా ఫలితాలపై మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పుకొచ్చాడు. 'కొన్ని సంవత్సరాలుగా నాలుగు రోజుల టెస్టులు ఉండాలని నేను చెబుతున్నా. ఇప్పుడు కాకపోయినా.. కొంతకాలం తర్వాతనైనా నాలుగు రోజులు ప్రవేశపెట్టాలి. రెండేళ్ల తర్వాత వీటిని రెగ్యులర్‌గా ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నా. రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల క్రికెట్ ఆడుతున్నాం. అందులో ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి టెస్ట్ మ్యాచ్‌లలో మార్పులు ఎందుకు చేయకూడదు?. నాలుగు రోజుల టెస్టులు ప్రవేశపెడితే ఫలితాలపై మరింత ఫోకస్ పెరుగుతుంది. నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లకు నేను పూర్తిగా అంగీకరిస్తున్నా' అని అన్నాడు.

నాలుగు రోజుల టెస్టులకు నేను పూర్తిగా వ్యతిరేకం: పాంటింగ్

నాలుగు రోజుల టెస్టులకు నేను పూర్తిగా వ్యతిరేకం: పాంటింగ్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ కూడా వ్యతిరేకించాడు. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ల నిర్వహణ పట్ల తాను ఆసక్తి చూపడం లేదన్నాడు. ఆదివారం క్రికెట్ ఆస్ట్రేలియాతో పాంటింగ్ మాట్లాడుతూ... 'నాలుగు రోజుల టెస్టులకు నేను పూర్తిగా వ్యతిరేకం. ఈ ఆలోచన వెనుక కారణాలను తెలుసుకోవాలనుకుంటున్నా. గత రెండు ఏళ్లలో చాలా టెస్టులు నాలుగు రోజుల్లోనే ముగిశాయి. ఈ విషయం అందరికి తెలుసు. కానీ.. గత దశాబ్దంలో ఎక్కువ మ్యాచ్‌లు డ్రాలే అయ్యాయి. ఆ సమయాల్లో నాలుగు రోజుల టెస్టులే ఉండి ఉంటే.. దాదాపు అన్ని మ్యాచ్‌లు డ్రాలే అయ్యేవి. ఇక్కడ వాణిజ్యపరమైన కోణం ఉందని అర్థం చేసుకున్నా. డబ్బులు ఆదా చేయడం కోసం ఆదివారం మ్యాచ్ ముగియడానికి గురువారం ఎలా ప్రారంభిస్తారు' అని అన్నాడు.

నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌కు నేను వ్యతిరేకం: మెక్‌గ్రాత్

నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌కు నేను వ్యతిరేకం: మెక్‌గ్రాత్

"నాకు ఐదు రోజుల ఆట చాలా ప్రత్యేకం. టెస్టు క్రికెట్‌ ఎన్ని రోజులు ఆడాలనేదానికి నేను వ్యతిరేకం. ఇప్పుడెలా ఉందో అలానే ఇష్టం" అని ఆసీస్‌ మాజీ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ అన్నాడు. 'నేను సంప్రదాయ ఆటగాడిని. నాకు ఐదు రోజుల టెస్ట్ ఆట చాలా ప్రత్యేకం. అంతకుమించి కుదించడమంటే నాకు అస్సలు నచ్చదు' అని మెక్‌గ్రాత్‌ చెప్పినట్లు పేర్కొంది.

Story first published: Friday, January 10, 2020, 13:44 [IST]
Other articles published on Jan 10, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+