రాష్ట్రపతికి 81 ఏళ్లు, కానీ బీసీసీఐలో మాత్రం ఉండకూడదా?: వివక్షపై షా
హైదరాబాద్: క్రికెట్‌లో లోధా కమిటీ సూచించిన సంస్కరణల అమలుపై బీసీసీఐ మంగళవారం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో 74 ఏళ్ల నిరంజన్‌షా కూడా సభ్యుడిగా ఉన్నాడు. 74 ఏళ్ల నిరంజన్ షాను కమిటీలోకి తీసుకోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
లోధా కమిటీ సంస్కరణల ప్రకారం బీసీసీఐ, దాని అనుబంధ సంస్ధల్లో 70 ఏళ్ల పైబడిన వారు విధులు నిర్వహించడానికి అనర్హులు. అయితే లోధా కమిటీ సూచించిన సంస్కరణల అమలుపై ఏర్పాటు చేసిన కమిటీలో నిరంజన్‌కు ఎలా చోటు కల్పించారంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

తనపై వస్తున్న విమర్శలపై నిరంజన్ షా
తనపై వస్తున్న విమర్శలపై నిరంజన్ షా స్పందించారు. ఈ క్రమంలో నిరంజన్ షా ఓ సరికొత్త లాజిక్‌ను తెరపైకి తీసుకొచ్చారు. బోర్డులో 70 ఏళ్లకు పైబడిన వ్యక్తులు ఉండకూడదన్న లోధా కమిటీ సిఫారసును ఆయన తప్పుబట్టారు. 70 ఏళ్లకు పైబడిన వ్యక్తి భారత రాష్ట్రపతి (ప్రణబ్ వయసు 81 ఏళ్లు)గా ఉండొచ్చు కానీ బీసీసీఐలో మాత్రం ఉండకూడదా? అని ప్రశ్నించారు. అసలు బీసీసీఐలో వయసుపై ఎందుకు ఈ కొత్త రకం ఆంక్షలు విధిస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. ఫిట్‌గా ఉండే బతికున్నంత కాలం పని చేయవచ్చు. ఇది కచ్చితంగా వివక్షే అని నిరంజన్ షా అన్నారు. 30 ఏళ్ల అనుభవం ఉన్నందున కమిటీలో చోటు కల్పించారు.

అనుభవం మిగతా వాళ్లకు పనికొస్తుందనే
ఈ కమిటీలో నేను ఉండటం వల్ల లోధా సిఫారసులపై గతంలో చర్చించిన అనుభవం మిగతా వాళ్లకు పనికొస్తుందని ఆయన చెప్పారు. వయసు పరిమితితోపాటు ఒకే రాష్ట్రానికి, ఒకే ఓటు అన్న సిఫారసును కూడా నిరంజన్ షా వ్యతిరేకిస్తున్నారు. ఇలా అయితే తన సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు కూడా నష్టం జరుగుతుందని అన్నారు. 'వ్యక్తిగతంగా నేను దీనికి వ్యతిరేకం కాను. అయితే ఈ సిఫారసు అమలు చేయడం వల్ల దేశంలోని ఎంతో పేరున్న సౌరాష్ట్ర, ముంబైలాంటి అసోసియేషన్లు కూడా ఓటు హక్కు కోల్పోతాయి' అని నిరంజన్ షా అన్నారు.

వేర్వేరు పదవులపై ఇలా
ఇదిలా ఉంటే బోర్డులో రెండు వేర్వేరు పదవులను చేపట్టడానికి మధ్య మూడేళ్ల గ్యాప్ ఉండాలన్న సిఫారసును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 'అదెలా సాధ్యం. జాయింట్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి తర్వాత సెక్రటరీ అవడానికి ప్రయత్నిస్తాడు. దీనివల్ల బోర్డులో పదవుల మార్పుతోపాటు ఒక కొనసాగింపు ఉంటుంది' అని షా అన్నారు. లోధా కమిటీ సంస్కరణలను పూర్తిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఏడుగురు సభ్యులతో బీసీసీఐ కమిటీ
లోధా కమిటీ సంస్కరణల అమలుకు అత్యంత కష్టంగా ఉన్న అంశాలను గుర్తించడానికి ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఏడుగురు సభ్యులను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సౌరవ్ గంగూలీ కూడా కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications