
టాపర్స్ ఈ జట్లే..
తొలి రౌండ్ ముగిసిన తరువాత గ్రూప్ - ఏ పాయింట్ల పట్టికలో నమీబియా అగ్రస్థానానికి చేరుకుంది. రెండో స్థానంలో నెదర్లాండ్స్ నిలిచింది. అట్టడుగు స్థానానికి దిగజారింది శ్రీలంక. గ్రూప్-బీలో స్కాట్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. వెస్టిండీస్ చిట్టచివరలో నిలిచింది. గ్రూప్స్‌లో ఉన్న ఆడబోయే అన్ని మ్యాచ్‌లను కూడా ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన దుస్థితిలో ఉన్నాయి శ్రీలంక గానీ.. వెస్టిండీస్ గానీ. ఏ మాత్రం తేడా కొట్టినా సూపర్ 12కు అర్హత సాధించలేవు.

పాకిస్తాన్ హర్డిల్..
టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రస్థానంపై మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా స్పందించాడు. ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఈ నెల 23వ తేదీన జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పైనే ఉందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌ను గెలిస్తే- భారత్ ఖచ్చితంగా ఫైనల్స్ చేరుకుంటుందని, రోహిత్ సేన ఛాంపియన్‌గా ఆవిర్భవిస్తుందని వ్యాఖ్యానించాడు. ఇది జరగాలీ అంటే- తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించాల్సి ఉంటుందని స్పష్టంచేశాడు.

బ్యాటింగ్, బౌలింగ్ గుడ్..
ప్రస్తుతం టీమిండియాలో బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ పకడ్బందీగా ఉందని సురేష్ రైనా చెప్పాడు. జస్‌ప్రీత్ బుమ్రా స్థానాన్ని మహ్మద్ షమీ సక్సెస్‌ఫుల్‌గా రీప్లేస్ చేశాడని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై వామప్ మ్యాచ్‌లో తీవ్ర ఒత్తడి మధ్య అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడని కితాబిచ్చాడు. అదే సమయంలో టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారాడని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతను రాణించగలడని పేర్కొన్నాడు.

కేఎల్ రాహుల్ ది బెస్ట్..
ఆస్ట్రేలియాపై ఓపెనర్ కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడటాన్ని సురేష్ రైనా ప్రస్తావించాడు. రోహిత్ శర్మకు అతను మాత్రమే సరైన ఓపెనింగ్ భాగస్వామి అని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్ స్ట్రైక్ రొటేట్ చేయడం బాగుందని వ్యాఖ్యానించాడు. టీ20 ఫార్మట్‌లో మిడిల్ ఓవర్స్‌లో పరుగులు సాధించడం అత్యవసరమని, ఆ రోల్‌ను సూర్యకుమార్ యాదవ్ సమర్థవంతంగా పోషిస్తోన్నాడని చెప్పాడు. ఆస్ట్రేలియాపై వామప్‌లో అది సెట్ కావడం వల్లే 186 పరుగుల భారీ స్కోర్‌ను భారత్ సాధించగలిగిందని గుర్తుచేశాడు.

విరాట్ కోహ్లీపై..
విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, ఐసీసీ నిర్వహించే ఇలాంటి ఈవెంట్లల్లో దూకుడుగా ఆడటం అతని నైజమని చెప్పాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, సూర్యకుమార్ యాదవ్.. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం టాప్ ఫామ్‌లో కొనసాగుతోందని, టీ20 ప్రపంచకప్‌ను గెలవడానికి ఇంతకంటే మంచి సమయం ఉండబోదని వ్యాఖ్యానించాడు. ఇదే దూకుడుతో రోహిత్ శర్మ.. పాకిస్తాన్‌ను నిలువరించగలుగుతాడని భావిస్తున్నట్లు చెప్పాడు.


Click it and Unblock the Notifications












