Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2019 వరల్డ్ గెలిస్తే: ఆక్స్‌ఫర్డ్‌ వీధుల్లో చొక్కా విప్పితిరగాలి

Virat Kohli

హైదరాబాద్: 2019లో జరిగే వరల్డ్ కప్‌కి ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2019లో జరిగే వరల్డ్ కప్‌లో టీమిండియా గనుక వరల్ కప్ గెలిస్తే కోహ్లీ చొక్కా విప్పి ఆక్స్‌ఫర్డ్‌ వీధుల్లో చక్కర్లు కొడతాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

తాజాగా ఓ జాతీయా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో గంగూల మాట్లాడుతూ 'వీవీఎస్‌ లక్ష్మణ్‌, హర్భజన్‌ సింగ్‌ జట్టులో ఉన్నారన్న ధైర్యంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు అదే ఫీలింగ్‌ కింగ్‌ కోహ్లీని చూస్తే కలుగుతోంది. మేము క్రికెట్‌ ఆడే సమయంలో టీమిండియా ఆట తీరు వేరు. అప్పటి ఆలోచనలు కూడా వేరు' అని గంగూలీ అన్నాడు.

'ఆ తర్వాత ధోని హవా. అతడు కూడా భారత క్రికెట్‌కు మరింత దూకుడు నేర్పించాడు. ఇక్కడ భారత క్రికెట్‌లో ఉన్న గొప్పదనం ఏంటంటే, ప్రతి విభాగంలోనూ రోల్‌మోడల్స్‌ ఉన్నారు. ఇలా భారత్ క్రికెట్‌ ఒక్కో మెట్టు ఎక్కుతూ అభివృద్ధి సాధించింది. ఇప్పుడు అందరికీ కోహ్లీ అందరి రోల్‌ మోడల్‌. 2019లో భారత్ వరల్డ్ కప్ గెలిస్తే ఆక్స్‌ఫర్డ్‌ వీధుల్లో కోహ్లీ చొక్కా విప్పి ఆనందంగా తిరగాలని కోరుకుంటున్నా. ఇది నా కోరిక మాత్రమే' అని గంగూలీ నవ్వుతూ తన మనసులోని మాటను చెప్పాడు.

Ganguly

ఇదిలా ఉంటే సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌పై నాట్‌వెస్ట్‌ ట్రోఫీని గెలిచిన ఆనందంలో అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో తన చొక్కా విప్పి గాల్లోకి తిప్పుతూ ఆనందం వ్యక్తం సన్నివేశాన్ని ప్రతి సన్నివేశాన్ని భారత్‌కు చెందిన ఓ ఒక్క క్రికెట్ అభిమాని ఇప్పటికీ మరచిపోలేరు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 4, 2017, 20:12 [IST]
Other articles published on Dec 4, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+