
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా క్వీన్ పార్క్ ఓవల్‌లో జరుగుతున్న చివరి వన్డేపై వరుణుడు కన్నెర్ర చేశాడు. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ శిఖర్ ధావన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ధావన్, శుభ్‌మన్ గిల్ క్రీజులో కుదురుగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 113పరుగుల వద్ద హాఫ్ సెంచరీ చేసిన ధావన్ (74బంతుల్లో 7ఫోర్లతో 58పరుగులు) హైడెన్ వాల్స్ బౌలింగ్లో పూరన్ చేతికి చిక్కాడు.
ఇక క్రీజులో శుభ్ మన్ గిల్ (65బంతుల్లో 51పరగులు 3ఫోర్లు, 1సిక్సర్ నాటౌట్) హాఫ్ సెంచరీకి తోడుగా శ్రేయస్ అయ్యర్ (2పరుగులు నాటౌట్) కదం తొక్కుదామనుకున్న టైంలో వరుణుడు ఆటకు బ్రేకులేశాడు. వెదర్.కామ్ ప్రకారం.. ముందుగానే ఈ మ్యాచ్‌కు వర్షపు గండం పొంచి ఉంది. అనుకున్నట్లుగానే వాన పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో దంచి కొట్టింది. కాసేపు చిరుజల్లులు పడ్డా.. మళ్లీ పుంజుకుంది. దీంతో స్టేడియం ఔట్ ఫీల్డ్ తడిగా మారింది.
పిచ్ మొత్తం కవర్లతో కప్పేశారు. ఇక 24ఓవర్లకు 115పరుగుల వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలగడంతో వర్షం తగ్గడానికి ఇరు జట్ల ప్లేయర్లు వెయిట్ చేస్తున్నారు. నిర్ణీత టైం (ఫస్ట్ ఇన్నింగ్స్) వరకు కూడా ఆట సాధ్యం కాకపోతే డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆటను జరుపుతారు.ఇక డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. వెస్టిండీస్ టార్గెట్ ఈ రకంగా నిర్దేశించబడుతుంది.
24ఓవర్లకు టార్గెట్ 191
23ఓవర్లకు టార్గెట్ 186
22ఓవర్లకు టార్గెట్ 180
21ఓవర్లకు టార్గెట్ 174
20ఓవర్లకు టార్గెట్ 168
వాన వల్ల మ్యాచ్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే ఇండియా సిరీస్‌ను 2-0తో గెలుచుకుంటుంది.
తుది జట్లు:
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, కీసీ కార్తీ, షమర్ బ్రూక్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, కీమో పాల్, అకేల్ హోసేన్, హేడెన్ వాల్ష్, జేడెన్ సీల్స్
భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ