Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ దాడి చేస్తే... పాక్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణాన్ని స్ఫురిస్తుంది. ఇప్పటికే దేశం మొత్తం పాకిస్తాన్ పై తీవ్ర కోపంతో ఊగిపోతోంది. చాలా మంది పాకిస్థాన్ కు యుద్ధం తోనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు పాక్ మాజీ క్రికెటర్, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం స్పందించారు. పాక్ ప్రభుత్వం గానీ, ఆర్మీ గానీ ఉగ్రవాదులకు మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. పాకిస్థాన్ కూడా ఉగ్రదాడులతో సతమతమవుతోందన్న సంగతి ప్రపంచం గుర్తించాలని అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ

ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "భారత్ మా మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకొనేది లేదు, ఆలోచించకుండా తిరిగి దాడి చేస్తాం. టెర్రరిజం పెంచి పోషించడం, లేదా వేరే దేశం మీద కు పంపించడం మాకు కూడా శ్రేయస్కరం కాదు" అని చెప్పుకొచ్చాడు.

ఉగ్రదాడిపై ఆధారాలు చూపితేనే

ఉగ్రదాడిపై ఆధారాలు చూపితేనే

భారత్ తమపై ఆరోపణలు చేయడం మాని ఉగ్రదాడిపై ఆధారాలు చూపితే ఏమైనా చర్యలు తీసుకోగలమని ఆయన స్పష్టం చేశారు. అలా కాదని తమపై దాడికి దిగితే ధీటైన సమాధానం చెప్పేందుకు పాక్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉందని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలు జారీ చేశారు.

కాశ్మీర్‌లో సుస్థిరత కావాలి

కాశ్మీర్‌లో సుస్థిరత కావాలి

సౌదీ యువరాజు స‌ల్మాన్ వస్తున్న తరుణంలో మేము ఎందుకు భారత్‌పై దాడి చేస్తామని, భారత్ ఇంకా గతంలోనే జీవిస్తుందని, ఈ ప్రాంతంలో సుస్థిరత కావాలని ఆయన చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడితో దేశమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.

40కి మందికి పైగా జవాన్లు వీరమరణం

40కి మందికి పైగా జవాన్లు వీరమరణం

ఈ దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడితో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలాయి. దీనికి దాయాది దేశం పాకిస్థానే కారణమంటూ ప్రజలంతా ఆందోళనలు చేపట్టారు. ఇప్పటికే పాక్ క్రికెటర్ల ఫోటోలను వివిధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు తీసేసిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, February 20, 2019, 10:24 [IST]
Other articles published on Feb 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+