న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్యాన్స్ నోట ధోని నినాదాలు: పంత్ అలవాటు పడాల్సిందేనంటున్న దాదా

India vs West Indies 1st T20 : 'Dhoni Dhoni' Slogans || Oneindia Telugu
If I were Virat Kohli, I would let Rishabh Pant go through it: Sourav Ganguly on Dhoni, Dhoni chants

హైదరాబాద్: యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ మైదానంలో ధోనీ నినాదాలు వినేందుకు అలవాటు పడాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. అభిమానులు చేస్తోన్న ఆ నినాదాలను వింటూనే వాటి ఒత్తిడి నుంచి బయటపడేందుకు మార్గం వెతకాలని దాదా సూచించాడు.

శుక్రవారం ఇండియా టుడే కాన్‌క్లేవ్ ఈస్ట్ 2019లో రిషబ్ పంత్‌ పేలవ ఫామ్‌పై సౌరవ్ గంగూలీ స్పందించాడు. గంగూలీ మాట్లాడుతూ "ఆ నినాదాలు పంత్‌కు మంచివే. వాటికి అతడు అవాటు పడాలి. అవి వింటూనే విజయవంతం అవ్వడానికి దారి కనుక్కోవాలి. ఒత్తిడిని ఎదుర్కొంటూనే అతడు క్రికెట్లో తన ముద్ర వేయాలి" అని అన్నాడు.

IPL 2020: ఢిల్లీ సహా యజమానిగా గంభీర్, 10శాతం వాటా విలువ రూ.100 కోట్లు!IPL 2020: ఢిల్లీ సహా యజమానిగా గంభీర్, 10శాతం వాటా విలువ రూ.100 కోట్లు!

"ప్రతిసారీ ధోనీ అందుబాటులో ఉండడు. భారత క్రికెట్‌లో ధోని సాధించినది పంత్‌ సాధించాలంటే 15 ఏళ్లు పడుతుంది. భారత్‌కు అతడు చేసిన సేవలకు బీసీసీఐ కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. ధోనీని ఎవరైనా గౌరవిస్తారు. భారత క్రికెట్‌కు ధోని చాలా చేశాడు. కేవలం థాంక్స్‌తో అతని సేవలకు ముగింపు చెప్పలేం" అని గంగూలీ అన్నాడు.

"రిటైర్మెంట్‌‌పై ధోనినే నిర్ణయం తీసుకుంటాడు. ధోని రిటైర్మెంట్‌పై చర్చలకు ముగింపు పలుకుదాం. దిగ్గజాలకు తగిన గౌరవం ఇవ్వాలి. అవును, అతడికి టచ్‌లోనే ఉన్నాం. మేము విరాట్ కోహ్లీతో కూడా మాట్లాడుతున్నాం. మేము సెలెక్టర్లతో మాట్లాడతాము. అది టీమిండియా క్రికెట్‌ అధికారులు, సెలక్షన్‌ కమిటీ చూసుకుంటుంది. ధోని రిటైర్మెంట్ అంశం ప్రస్తుతానికి అక్కడే ఉంది" దాదా అన్నాడు.

Story first published: Friday, December 6, 2019, 19:43 [IST]
Other articles published on Dec 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X