Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీని స్లెడ్జింగ్‌ చేస్తే సహనాన్ని కోల్పోతాడు.. సచిన్ మాత్రం.. : అక్ర‌మ్‌

If I sledge Virat, he will get angry: Wasim Akram explains difference between Kohli, Tendulkar

కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్‌ చేస్తే చాలా సులువుగా తన సహనాన్ని కోల్పోతాడు అని పాకిస్తాన్‌ మాజీ సారథి, దిగ్గజ బౌలర్‌ వసీం అక్రమ్‌ అన్నాడు. సహనం కోల్పోతే వికెట్‌ కోల్పోయే ప్రమాదం ఉందన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న అనేక రికార్డులను కోహ్లీ బద్దలుకొట్టగలడా అనే అనుమానాన్ని అక్ర‌మ్‌ వ్యక్తం చేశాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడాటోర్నీల‌న్నీ ర‌ద్దు కావ‌డంతో ఆట‌గాళ్లంతా ఇళ్లకే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే.

 స‌చిన్, కోహ్లీ మ‌ధ్య పోలిక స‌రికాదు:

స‌చిన్, కోహ్లీ మ‌ధ్య పోలిక స‌రికాదు:

భార‌త మాజీ ఓపెన‌ర్ ఆకాశ్ చోప్రా సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా నిర్వ‌హిస్తున్న 'ఆకాశ‌వాణి' లైవ్ చాట్‌లో తాజాగా వసీం అక్ర‌మ్ పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా స‌చిన్‌, కోహ్లీ ఆట‌తీరుకు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 'నేను మనసులో ఏది అనుకుంటే అది నిర్మోహమాటంగా చెబుతాను. సచిన్‌, కోహ్లీ ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు. ఇప్పటికే కోహ్లీ అనేక రికార్డులను నెలకొల్పాడు. కానీ.. వీరిద్దరిని పోల్చడం సరికాదు' అని పాక్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.

ఇప్పుడే చెప్పడం కష్టం:

ఇప్పుడే చెప్పడం కష్టం:

'స‌చిన్ నెల‌కొల్పిన అనేక రికార్డుల‌ను కోహ్లీ తిరుగ‌రాస్తాడా అంటే.. ఇప్పుడే చెప్పడం తొంద‌ర‌పాటు అవుతుంది. మాస్ట‌ర్ నెల‌కొల్పిన చాలా రికార్డుల‌కు కోహ్లీ ఇంకా దూరంలో ఉన్నాడు. ఇద్దరి బ్యాటింగ్‌లో, బాడీ లాంగ్వేజీలో చాలా తేడాలు ఉన్నాయి. సచిన్‌, కోహ్లీలు దూకుడైన ఆటగాళ్లు. అయితే ఇద్దరిలో ఓ ప్రధాన తేడా ఉంది. సచిన్‌ను స్లెడ్జింగ్‌ చేస్తే..నవ్వుతూ బ్యాట్‌తోనే సమాధానం చెప్తాడు. ప్రత్యర్థి బౌలర్‌ కవ్వింపు చర్యలకు దిగితే సచిన్‌ ఏకాగ్రతతో ఆడతాడు. కానీ కోహ్లీ అలాకాదు. అతడిని స్లెడ్జింగ్‌ చేస్తే.. చాలా సులువుగా సహనాన్ని కోల్పోతాడు. ఇలా సహనం కోల్పోతే వికెట్‌ కోల్పోయే ప్రమాదం ఉంది' అని అక్రమ్‌ చెప్పుకొచ్చాడు.

 104 టెస్టులు, 356 వన్డేలు:

104 టెస్టులు, 356 వన్డేలు:

ఒక మ్యాచ్‌లో తాను తీవ్ర స్థాయిలో స్లెడ్జింగ్‌ చేయడంతో ఆగ్రహానికి గురైన వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌.. మ్యాచ్ అనంతరం తనను కొట్టడానికి వచ్చినట్టు మాజీ పేసర్‌ వసీం అక్రమ్‌ తాజాగా గుర్తు చేస్తున్నాడు. షర్ట్ విప్పేసి చేతిలో బ్యాట్‌ పట్టుకుని పాక్ డ్రెస్సింగ్ రూంకి రిచర్డ్స్ వెళ్లగా.. అక్రమ్‌ వణికిపోయాడట. 1988లో బార్బడోస్ టెస్టులో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు పాక్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అక్రమ్‌ తెలిపాడు. పాక్ తరఫున అక్రమ్‌ 104 టెస్టులు, 356 వన్డేలు ఆడాడు.

నా టాలెంట్‌ను వారే గుర్తించారు:

నా టాలెంట్‌ను వారే గుర్తించారు:

'నేను క్రికెట్‌ ఆడే తొలి రోజుల్లో నా టాలెంట్‌ను ఇమ్రాన్‌ భాయ్‌, మియాందాద్‌ భాయ్‌, ముదాసర్‌ నజార్‌లు మాత్రమే గుర్తించారు. ఈ కుర్రాడిలో టాలెంట్‌ ఉందని వారు పదే పదే చెబుతూ ఉండేవారు. అది నాకు అర్థం అయ్యేది కాదు' అని గత జ్ఞాపకాలను అక్రమ్ గుర్తు చేసుకున్నాడు. ఆ ముగ్గురి నుండి వేరు వేరు విషయాలను నేర్చుకున్నానన్నాడు. అయితే తాను టాలెంట్‌ అనే ట్యాగ్‌ను ఎంజాయ్‌ చేసేవాడినని అక్రమ్‌ తెలిపాడు.

Story first published: Thursday, May 14, 2020, 12:05 [IST]
Other articles published on May 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+