Ricky Ponting: ఏమనుకుంటున్నారు అసలు.. అపొజిట్ టీంలో కోహ్లీ ఉన్నాడని తెలిస్తేనే వణుకు పుడుతుంది

టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో విరాట్ కోహ్లీని కొనసాగించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జట్టు మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. విరాట్ లాంటి స్టార్ బ్యాటర్ ఉన్న భారత జట్టుతో ఆడాలంటే తనకు భయం పుడుతుందని కూడా పేర్కొన్నాడు. ప్రస్తుతం కోహ్లీ పేలవమైన ఫాంలో ఉన్నాడు. దీంతో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసే భారత జట్టులో అతని స్థానం గురించి ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అతను పేలవ ఫాంలో ఉన్నా.. కోహ్లీకి మద్దతుగా నిలబడి చోటు ఇవ్వాలని పాంటింగ్ జట్టు మేనేజ్‌మెంట్‌ను కోరారు.

అతను లేని జట్టును నేను ఊహించలేను
ఐసీసీ రివ్యూలో కోహ్లీ మాట్లాడాడు. విరాట్ కోహ్లీ జట్టులో ఉంటే తన ప్రభావాన్ని చూపగలడని పేర్కొన్నాడు. 'ఒకవేళ నేనే గనుక అపోజిట్ టీం కెప్టెన్‌గా లేదా ప్లేయర్‌గా ఉంటే.. విరాట్ కోహ్లీ ఉన్న ఇండియా జట్టుతో ఆడటానికి వణికిపోయేవాడిని. అంతటి గొప్ప ప్లేయర్ విరాట్. అతను లేని జట్టును నేను ఊహించలేను. ప్రస్తుతం అతనికి ఇది సవాల్‌తో కూడిన టైం. అయినా కోహ్లీ దీన్ని అధిగమిస్తాడు'

గొప్ప గొప్ప వాళ్లందరూ ఎదుర్కొన్నారు
'క్రికెట్లో ప్రతి గొప్ప ఆటగాడు ఏదో ఒక దశలో పేలవ ఫామ్ ఎదుర్కొన్నాడు. బ్యాట్స్‌మన్ అయినా బౌలర్ అయినా ఒక దశలో ఫామ్ కోల్పోయి బాధపడ్డవారే. ఎలాగోలా అత్యుత్తమ ప్లేయర్లు తిరిగి పుంజుకోవడానికి వాళ్లంతట వాళ్లే ఒక మార్గాన్ని కనుగొంటారు. విరాట్ కూడా అలా చేస్తాడు. అతను మళ్లీ ఫాం పుంజుకోవడానికి ఎంతో టైం పట్టదు' అని పాంటింగ్ అన్నాడు.

ఒకవేళ అదే జరిగితే కోహ్లీ మళ్లీ ఎంపిక కాడు
'ఒకవేళ విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని నిర్ణయించుకుంటే.. ఇక మళ్లీ అతను జట్టుకు సెలెక్ట్ కావడం గగనమేనని పాంటింగ్ చెప్పాడు. 'మీరు విరాట్ కోహ్లీని ప్రపంచకప్ ముందు జట్టు నుంచి తప్పించారనుకోండి. అతని స్థానంలో వచ్చిన బ్యాటర్ స్థిరంగా రాణించినట్లయితే.. ఇక విరాట్ మళ్లీ జట్టులోకి రావడం కష్టం. నేను ఇండియా టీం సెలెక్టర్ అయితే.. అతన్ని టీ20 ప్రపంచకప్ జట్టులో కొనసాగిస్తాను. ఎందుకంటే అతని ప్రభావమేంటో నాకు తెలుసు. '

తర్వాత మీరే చూస్తారుగా..
'అతను తిరిగి ఆత్మవిశ్వాసం పొందితే.. అతని స్థానంలో ఎవరు ఎంపికైనా అతని కంటే గొప్ప ప్రదర్శన మాత్రం చేయలేరు. ఒకవేళ నేను కెప్టెన్ లేదా కోచ్ అయినా.. అతను ఫాం పుంజుకోవడానికి వీలయినంత టైం ఇస్తాను. అతని ఫామ్ పుంజుకునే ప్రాసెస్ ఈజీ చేస్తాను. ఏదేమైనా అతను మళ్లీ తన ఫ్లిక్‌ను అంతుకుని రన్స్ చేసేవరకు కాస్త ఓపిక పట్టండి. తర్వాత మీరే చూస్తారుగా' అని పాంటింగ్ అన్నాడు. టాపార్డర్‌లోనే కోహ్లీని కొనసాగించాలని, అతని బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications