For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధ్రువ్ మరో ధోనీ కావాలంటే..అతన్ని దాటాలి - కుంబ్లే

గత కొన్నిరోజులుగా టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ వార్తల్లో హైలైట్‌గా నిలుస్తున్నాడు. ఇంగ్లండ్‌తో రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ధ్రువ్ హీరో ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో ఆదుకున్నాడు. ఛేదనలోనూ గిల్‌తో కలిసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ధ్రువ్ మరో ధోనీ అవుతాడని మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సురేశ్ రైనా కొనియాడారు. అయితే ధ్రువ్‌కు ధోనీ కావాడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, కానీ రిషభ్ పంత్ తిరిగొస్తున్నాడనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. పంత్ రాకతో పరిస్థితులు మారిపోయే అవకాశాలు ఉంటాయని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ఆటకు ఏడాదికిపైగా దూరమైన విషయం తెలిసిందే. ఐపీఎల్‌తో పంత్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

If Dhruv Jurel wants another MS Dhoni...he has to face Pant - Anil Kumble

''అక్కడ రిషభ్ పంత్ ఉన్నాడు. అతడు ఎప్పుడు తిరిగొస్తాడో మనకు తెలియదు. రీఎంట్రీతో పంత్ లాభాన్ని పొందుతాడు. కానీ ధోనీ తన కెరీర్‌లో అందుకున్న ఘనతలు సాధించడానికి ధ్రువ్‌కు అన్నీ అర్హతలు ఉన్నాయి. డిఫెన్స్‌తో పాటు ఎటాకింగ్ గేమ్‌లోనూ ధ్రువ్ తన టెక్నిక్, టెంపరమెంట్‌ను చూపించాడు. రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడి ఆటతో భరోసా ఇచ్చాడు. టెయిలెండర్లతో కలిసి పరుగులు సాధించాడు. భారీ సిక్సర్లు బాదాడు''

''వికెట్ కీపింగ్‌లోనూ అసాధారణ ప్రదర్శన చేస్తున్నాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్‌లో గొప్పగా గ్లవ్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. స్పిన్‌లోనూ కొన్ని అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు. అతడు రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. భవిష్యత్‌లో మరింత మెరుగవుతాడు. ఫస్ట్ క్లాస్ గేమ్స్‌లో అనుభవం తక్కువ ఉన్న అతడిని తుదిజట్టులోకి ఎంపిక చేయడం గొప్ప నిర్ణయమే. అతడిని నమ్మి అవకాశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత అతడు అదరగొట్టాడు. మరోవైపు ఈ విషయాలు కేఎస్ భరత్‌కు ఇబ్బంది పెడతాయి'' అని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు.

తొలి రెండు టెస్టుల్లో భరత్ విఫలమవ్వడంతో ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇచ్చారు. మూడో టెస్టుతో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇటీవల జరిగిన రాంచీ టెస్టులో 90, 32* పరుగులతో సత్తాచాటాడు.

Story first published: Wednesday, February 28, 2024, 11:30 [IST]
Other articles published on Feb 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+