వార్నర్‌పై వేటు వేసినపుడు..కోచ్‌లను ఎందుకు తప్పించరు?!అక్కడైతే మొదట తప్పించేది మేనేజర్‌నే!క్రికెట్‌లో ఎందుకిలా

David Warner పనికిరాడా.. మరి Coach ? Sunrisers ను దులిపేసిన Sunil Gavaskar || Oneindia Telugu

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ను ఆ జట్టు యాజమాన్యం తప్పించిన్నప్పుడు.. మరి కోచ్‌లపై ఎందుకు వేటు వేయలేదని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. ఫుట్‌బాల్‌ ఆటలో జట్టు తడబడితే.. మొదటగా తప్పించేది మేనేజర్‌నే అని, క్రికెట్‌లో ఎందుకు అలా తప్పించరన్నారు.

జట్టుకు ఏకైక టైటిల్ అందించిన వార్నర్ బ్యాట్స్‌మెన్‌గా కూడా పనికిరాడా అని సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2021 సీజన్‌‌లో 29 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత.. టీమ్‌లలో కరోనా కేసులు నమోదవడంతో టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది.

వార్నర్‌పై వేటు

వార్నర్‌పై వేటు

ఐపీఎల్‌ 2021లో పేలవ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంచైజీ లీగ్ నిలిచే ముందు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌పై వేటు వేసి.. న్యూజీలాండ్ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌కు జట్టు పగ్గాలు అందించింది. వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిన హైదరాబాద్ యాజమాన్యం.. ఆపై రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌‌లో కనీసం తుది జట్టులో కూడా చోటివ్వలేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఆరింట్లో ఓడిపోవడం, తుది జట్టు ఎంపికపై గుర్రుగా ఉన్న ఫ్రాంఛైజీ.. వార్నర్‌ విషయంలో కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఆరు మ్యాచ్‌లో 193 పరుగులు

ఆరు మ్యాచ్‌లో 193 పరుగులు

డేవిడ్ వార్నర్‌ 2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టులో చేరాడు. 2015లో జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇక 2016లో జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు అదే ఏకైక టైటిల్‌. ఐపీఎల్‌ అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా దేవ్ కొనసాగుతున్నాడు. ఓపెనర్‌గానూ తిరుగులేని రికార్డులతో కొనసాగుతున్న వార్నర్.. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. ఇక పీఎల్ 2021 సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన వార్నర్ 110.28 స్ట్రైక్‌రేట్‌తో 193 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఢిల్లీపై ఘన విజయం.. ఐపీఎల్ 2021 టైటిల్ బెంగళూరుదే! ఫాన్స్ ఫుల్ హ్యాపీ!

బ్యాట్స్‌మెన్‌గా కూడా పనికిరాడా

బ్యాట్స్‌మెన్‌గా కూడా పనికిరాడా

తాజాగా సునీల్ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ... 'డేవిడ్ వార్నర్ గత సీజన్ల తరహాలో దూకుడుగా ఆడి భారీ స్కోర్లు చేయలేదు. కానీ సహచరుల నుంచి లభించిన సపోర్ట్‌తో వార్నర్ టీమ్‌కి విలువైన పరుగులు చేశాడు. టీమ్ వరుస ఓటములకి అతడ్ని బాధ్యుడ్ని చేస్తూ కెప్టెన్సీ నుంచి తప్పించారు ఓకే. అతడు బ్యాట్స్‌మెన్‌గా కూడా పనికిరాడా?. ఇది మాత్రం వింతగా ఉంది. వార్నర్‌ను కెప్టెన్‌గా తొలగించడమే కాకుండా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించాలన్న నిర్ణయంపై ఆలోచించడానికి హైదరాబాద్‌కు ఇప్పుడు సమయం ఉంది. ఓసారి ఆలోచించండి' అని అన్నారు.

కోచ్‌లను ఎందుకు మార్చరు

కోచ్‌లను ఎందుకు మార్చరు

'హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను తప్పించడం పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక్కడ ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా. జట్టు ఓటములతో సీజన్ మధ్యలో కెప్టెన్‌ని మార్చినప్పుడు.. కోచ్‌లను ఎందుకు మార్చరు?. ఇది సమంజసం కాదు. ఫుట్‌బాల్‌ ఆటలో చూడండి.. జట్టు తడబడితే మొదటగా తప్పించేది మేనేజర్‌నే. క్రికెట్‌లో మాత్రం ఎందుకు అలా తప్పించరు' అని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశ్నిచారు. హైదరాబాద్‌కు ఎప్పటికీ మర్చిపోయి ఆరంభం దక్కిందని, ఐపీఎల్ వాయిదా వారికి పెద్ద ఉపశమనం అని పేర్కొన్నారు. సన్నీ భారత్ తరఫున 125 టెస్టులు, 108 వన్డేలు ఆడారు. టెస్టులో తనదైన ముద్ర వేసిన గవాస్కర్.. వన్డేల్లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, May 13, 2021, 14:19 [IST]
Other articles published on May 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X