
ఈ మ్యాచ్‌లో జాక్వస్ కల్లిస్ (37 బంతుల్లో 90 నాటౌట్; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఆఫ్రిదీ రాయల్స్ జట్టు 8 వికెట్ల తేడాతో డైమండ్స్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సెహ్వాగ్ డైమండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.

సెహ్వాగ్ (22 బంతుల్లో 46; 9 ఫోర్లు, ఒక సిక్సు)తో పాటు సైమండ్స్ (42 బంతుల్లో 67 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), కైఫ్ (30 బంతుల్లో 57; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్రిది రాయల్స్ జట్టు 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.

జాక్వస్ కల్లిస్(90 నాటౌట్), ఒవైస్ షా(37 నాటౌట్)గా నిలిచారు. డైమండ్స్ జట్టు బౌలింగ్‌లో దారుణంగా విఫలమమడంతో రాయల్స్ జట్టు అలవోక విజయం సాధించింది. ఇక, బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సైతం ఆఫ్రిదీ జట్టే విజయం సాధించిన సంగతి తెలిసిందే. కలిస్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా, ఒవైస్ షా 'మ్యాన్ ఆఫ్ ద సిరిస్'గా నిలిచారు.
జట్ల వివరాలు:
సెహ్వాగ్ పాలెస్ డైమండ్స్:
Virender Sehwag (c), Mohammad Kaif, Lasith Malinga, Michael Hussey, Mahela Jayawardene, Zaheer Khan, Ajit Agarkar, Tillakaratne, Andrew Symonds, Joginder Sharma, Ramesh Powar, Rohan Jain
అఫ్రిదీ రాయల్స్:
Jacques Kallis (c), Shahid Afridi, Shoaib Akhtar, Nathan McCullum, Daniel Vettori, Grant Elliott, Monty Panesar, Graeme Smith, Owais Shah, Abdul Razzaq, Jacques Kallis, Matt Prior, Aidan Andrews
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.