భారత్ తరపున చరిత్ర సృష్టించింది: ఐసీసీ


హైదరాబాద్: కరీబియన్ దీవుల్లో ప్రపంచ కప్ సమరంలో పాల్గొనేందుకు కొద్ది రోజుల ముందే వెస్టిండీస్‌లో పాగా వేసిన టీమిండియా తొలి మ్యాచ్ విజయంతో శుభారంభాన్ని నమోదు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ బాదుడుతో మహిళల జట్టు 34పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194పరుగులు చేసింది.
ఆరు ఓవర్లు ముగిసేలోపే మూడు వికెట్లు చేజార్చుకున్న భారత్‌ను.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(103; 51బంతుల్లో 7ఫోర్లు, 8సిక్సులు) ముందుండి నడిపించింది. ఆరంభంలో ఆచితూచి ఆడుతూ వచ్చిన హర్మన్.. కుదురుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. పదే పదే క్రీజు వదిలి బయటికి వస్తూ భారీ షాట్లు ఆడింది. అదే జోరు చివరి దాకా కొనసాగించి.. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో శతకాన్ని పూర్తి చేసుకుంది.
దీంతో టీ20ల్లో భారత్ తరఫున సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఆమె సెంచరీ పట్ల.. మ్యాచ్ విజయం పట్ల క్రీడా ప్రముఖులు ట్విటర్ వేదికగా హర్మన్‌ను అభినందించారు.
చరిత్ర సృష్టించింది
గయానాలో భారత్ తరఫున హర్మన్ ప్రీత్ తొలి శతకం సాధించి చరిత్ర సృష్టించింది.
గొప్పగా బోణీ కొట్టడం నిజంగా అద్భుతం
మహిళా టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున తొలి శతకం సాధించిన హర్మన్‌ప్రీత్‌కు అభినందనలు. తొలి మ్యాచ్‌నే ఇంత గొప్పగా బోణీ కొట్టడం నిజంగా అద్భుతం. రోడ్రిగ్స్‌తో కలిసి హర్మన్ ప్రీత్ చక్కగా బ్యాటింగ్ చేసింది.
హర్మన్ బ్యాట్‌తో దీపావళి ధమాకా
టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయం సాధించిన భారత మహిళల జట్టుకు అభినందనలు. హర్మన్‌ప్రీత్ మరోసారి బ్యాట్‌తో దీపావళి ధమాకా చూపించింది.
జట్టును ముందుండి నడిపించిన హర్మన్
తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన భారత మహిళల జట్టుకు ప్రత్యేక అభినందనలు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన అద్భుత సెంచరీతో జట్టును ముందుండి నడిపించింది. తర్వాతి మ్యాచ్‌ల్లోనూ జట్టు ఇదే జోరు కొనసాగించాలని కోరుకుంటున్నా.
తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు చక్కటి ఆరంభం. హర్మన్ ప్రీత్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది.
51బంతుల్లో 103పరుగులు.. టీ20ల్లో భారత్ తరఫున మహిళా క్రికెట్‌లో తొలి సాధించిన హర్మన్ ప్రీత్‌కు అభినందనలు.
టీ20ల్లో మహిళా క్రికెట్‌లో భారత్ తరఫున తొలి శతకం సాధించిన బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అభినందనలు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications