న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ తప్పుడు ట్వీట్‌.. నవ్వుకున్న నెటిజెన్లు

ICC Makes Image Gaffe On Twitter, Gets Hilariously Trolled By Bangladesh Cricket Board || Oneindia
ICC Wrong Tweet: Bangladesh Cricket Board trolls ICC over Andrew Hall photo

దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తప్పుడు ట్వీట్‌ చేసింది. ఓ క్రికెట్ ఆటగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పబోయి.. అతనికి బదులుగా మరొక క్రికెటర్ ఫొటోను పోస్ట్ చేసింది. ఐసీసీ తప్పుడు ట్వీట్‌ గమనించిన నెటిజెన్లు నవ్వుకున్నారు. ఐసీసీ తప్పుడు ట్వీట్‌ చేసి నవ్వులపాలైంది. అనంతరం ఐసీసీ తన తప్పును తెలుసుకుని సరిచేసుకుంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

బుధవారం దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ హాల్‌ 44వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఎప్పటిలాగే తన ట్విటర్‌ ద్వారా అందరికి శుభాకాంక్షలు చెప్పే ఐసీసీ.. ఆండ్రూ హాల్‌కు కూడా శుభాకాంక్షలు తెలిపింది. 'హ్యాపీబర్త్‌డే ఆండ్రూహాల్‌. దక్షిణాఫ్రికాకు చెందిన ఆండ్రూహాల్‌ అత్యుత్తమ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. దక్షిణాఫ్రికా తరఫున 111 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 143 వికెట్లు తీసి, 1600 పరుగులు చేశాడు' అని ఐసీసీ ట్వీట్ చేసింది.

అయితే ఆ ట్వీట్‌లో ఆండ్రూ హాల్‌ ఫొటోకి బదులు బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ కోచ్‌ చార్ల్‌ లాంగ్‌వెల్ట్‌ ఫొటో పెట్టి ఐసీసీ పోస్టు చేసింది. ఈ తప్పుని గమనించిన నెటిజెన్లు నవ్వుకున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌ క్రికెట్‌బోర్డు కూడా ఈ ట్వీట్‌పై స్పందిస్తూ రీట్వీట్‌ చేసింది. 'అతడు మా బౌలింగ్‌ కోచ్‌ చార్ల్‌ లాగ్‌వెల్ట్‌. హ్యాపీబర్త్‌డే టు ఆండ్రూహాల్‌' అని పోస్టు చేసింది. అనంతరం ఐసీసీ తన తప్పును తెలుసుకుని సరిచేసుకుంది. బంగ్లా క్రికెట్‌ బోర్డు తాజాగా లాంగ్‌వెల్ట్‌ను కొత్త బౌలింగ్‌ కోచ్‌గా నియమించుకుంది.

Story first published: Thursday, August 1, 2019, 11:51 [IST]
Other articles published on Aug 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X