న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారిద్దరూ నా టెక్నిక్‌లో సమస్యేమీ లేదన్నారు: శిఖర్ ధావన్‌

ICC Cricket World Cup 2019 : Shikhar Dhawan Says 'No Place For Negativity In My Life' || Oneindia
ICC WorldCup 2019: No place for negativity in my life says Shikhar Dhawan

సీమింగ్‌ పిచ్‌లపై కూడా నా టెక్నిక్‌లో సమస్యేమీ లేదని మాజీ కెప్టెన్లు రికీ పాంటింగ్‌, సౌరవ్‌ గంగూలీలు అన్నారని టీమిండియా ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ తెలిపారు. మాములు పిచ్‌లపై పరుగుల వరద పారించే శిఖర్ ధావన్‌.. సీమింగ్‌ పిచ్‌లపై తడబడుతాడు అనే విమర్శలు ఉన్నాయి. అయితే టీమిండియా ఆడిన 2013, 2017 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో సీమింగ్‌ పిచ్‌లపైనే రాణించాడు. ఇక 2015లో జరిగిన ప్రపంచకప్‌లో కూడా మంచి ప్రదర్శన చేసాడు.

100% ప్రదర్శన ఇస్తా:

100% ప్రదర్శన ఇస్తా:

త్వరలో ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్‌-2019 జరగనున్న నేపథ్యంలో ధావన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'నా ఐసీసీ టోర్నీ ప్రదర్శన గురించే ఎక్కువగా మాట్లాడతారు. ఐసీసీ టోర్నీలలో ఒకలా.. మామూలు టోర్నీలలో మరోలా ఆడను. ప్రతిసారీ 100% ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. విమర్శలను ఎప్పుడూ పట్టించుకోను. ఈ సారీ ఐసీసీ టోర్నీలో రాణిస్తానన్న నమ్మకముంది' అని ధావన్ తెలిపారు.

నా టెక్నిక్‌లో సమస్యేమీ లేదు:

నా టెక్నిక్‌లో సమస్యేమీ లేదు:

'మ్యాచ్ ఆడేటప్పుడు ఎక్కువగా ఒత్తిడికి గురికాను. కొన్నిమ్యాచుల్లో పరుగులు చేయకున్నా.. ఆ విషయం పెద్దగా ఆలోచించను. పత్రికలు చదవను, టీవీ చూడను. సోషల్ మీడియాను సందర్భాన్ని బట్టి వాడతాను. దీంతో నా టెక్నిక్‌ గురించి రాసే సంగతి నాకు తెలిసే అవకాశం లేదు. రికీ పాంటింగ్‌, సౌరవ్‌ గంగూలీలు నా టెక్నిక్‌లో సమస్యేమీ లేదన్నారు. టెస్టు అరంగేట్రానికి ముందు 9 సంవత్సరాలు దేశవాళీ క్రికెట్‌ ఆడాను. అప్పుడు కూడా ఒకేలా ఆడాను' అని ధావన్‌ చెప్పుకొచ్చారు.

సంగీతమంటే ఇష్టం:

సంగీతమంటే ఇష్టం:

'సంగీతమంటే చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరుకుతే సాధన చేస్తుంటాను. పాటలు కూడా వింటాను. వీటితో ఒత్తిడి దూరమవుతుంది. సిరీస్‌ల మధ్య గ్యాప్ ఉంటే కుటుంబంతో గడపడానికి ఇష్టపడతా. సిరీస్‌లలో జట్టు యాజమాన్యం అవకాశం ఇస్తే వారు నా వెంటే ఉంటారు. ఎక్కడ ఉన్నా కూడా వారు నాకు అండగా ఉంటారు' అని ధావన్ పేర్కొన్నారు.

Story first published: Wednesday, May 15, 2019, 9:24 [IST]
Other articles published on May 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X