న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ వచ్చేస్తోంది..!!

ICC World Test Championship: Virat Kohli-led India to play West Indies in July 2019

హైదరాబాద్: క్రీడా ఔత్సాహికులకు వరుస పండగలు.. ఇటు ఫిఫా ముగుస్తుందో లేదో.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ మొదలుకాబోతుంది. వన్డే, టీ20ల మాయలో పడి నిర్లక్ష్యానికి గురవుతున్న టెస్టు క్రికెట్‌కి పుర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అడుగులు వేసింది. టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-9లో ఉన్న జట్లు 2019 జూలై 15 నుంచి 2021 ఏప్రిల్ 30లోపు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆడేలా ఐసీసీ షెడ్యూల్ రూపొందింది.

 పరస్పర అంగీకారంతో 6 టెస్టు సిరీస్‌లు

పరస్పర అంగీకారంతో 6 టెస్టు సిరీస్‌లు

తొమ్మిది జట్లు కేటాయించిన రెండేళ్లలోపు ప్రత్యర్థి జట్లని పరస్పర అంగీకారంతో ఎంచుకుని ఆరు టెస్టు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ గడువు ముగిసే సరికి టాప్-2లో నిలిచిన జట్లకి 2021, జూన్‌‌లో ఫైనల్ నిర్వహించి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌ని నిర్ణయించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ షెడ్యూల్ ప్రకారం జూలై 2019న వెస్టిండీస్‌తో తొలి సిరీస్ ఆడనుంది.

13 జట్లతో వన్డే లీగ్‌ని కూడా ఐసీసీ

13 జట్లతో వన్డే లీగ్‌ని కూడా ఐసీసీ

టెస్టు ఛాంపియన్‌షిప్ తరహాలోనే 13 జట్లతో వన్డే లీగ్‌ని కూడా ఐసీసీ నిర్వహించనుంది. టెస్టు సభ్యత్యం ఉన్న 12 దేశాలతో పాటు నెదర్లాండ్‌ ఈ వన్డే లీగ్‌లో పోటీపడనుంది. ఈ లీగ్ 2020 మే 1న ప్రారంభమై.. 2022 మార్చి 31న ముగియనుంది. మొత్తం 13 జట్లు.. ప్రత్యర్థిని ఎంచుకుని రెండేళ్లలో ఎనిమిది సిరీస్‌లు ఆడాల్సి ఉంది.

 సొంతగడ్డపై ఆడాలన్న నిర్ణయాన్ని జట్ల అంగీకారంతో

సొంతగడ్డపై ఆడాలన్న నిర్ణయాన్ని జట్ల అంగీకారంతో

అది ఎవరి సొంతగడ్డపై ఆడాలన్న నిర్ణయాన్ని పరస్పర అంగీకారంతో జట్లు తీసుకోవచ్చు. గడువు ముగిసేలోపు టాప్-7లో ఉన్న జట్లు భారత్ వేదికగా 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కి నేరుగా అర్హత సాధించనున్నాయి. భారత జట్టు మాత్రం ఆతిథ్య హోదాలో నేరుగా టోర్నీలో ఆడనుంది. ఇక మిగిలిన ఐదు జట్లు క్వాలిఫయర్స్ ఆడటం ద్వారా ప్రపంచకప్‌‌కి అర్హత సాధించాల్సి ఉంటుంది.

 భారత జట్టు 2020, జూన్‌లో శ్రీలంకతో

భారత జట్టు 2020, జూన్‌లో శ్రీలంకతో

ఈ వన్డే లీగ్‌ని భారత జట్టు 2020, జూన్‌లో శ్రీలంకతో జరగనున్న సిరీస్‌తో ఆరంభించనుంది. టెస్టు జట్టుకు మాత్రం టీమిండియాకు కెప్టెన్‌గా కోహ్లీనే బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు సమాచారం.

Story first published: Wednesday, June 20, 2018, 19:25 [IST]
Other articles published on Jun 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X