టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల ఖాతా తెరిచిన విండీస్.. టాప్‌లో భారత్!!

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ ఖాతా తెరిచింది. ఛాంపియన్‌షిప్ ప్రవేశపెట్టి దాదాపు సంవత్సరం కావొస్తుండగా.. ఎట్టకేలకి విండీస్ ఖాతా తెరిచింది. సౌతాంప్టన్ వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిధ్య ఇంగ్లండ్‌ని 4 వికెట్ల తేడాతో ఓడించిన విండీస్.. 40 పాయింట్లని ఖాతాలో వేసుకుంది. ప్రతి టెస్టు సిరీస్‌కి ఐసీసీ 120 పాయింట్లు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడు టెస్టులు జరుగుతుండటంతో.. ప్రతి మ్యాచ్‌కీ 40 పాయింట్లని కేటాయించారు.

ఖాతా తెరిచిన విండీస్:

ఖాతా తెరిచిన విండీస్:

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టుతో కలిసి పాయింట్ల పట్టికలో అట్టడుగున విండీస్ ఉంది. సౌతాంప్టన్ టెస్టులో విజయం సాధించడంతో దక్షిణాఫ్రికాను వెనక్కి నెట్టి 7వ స్థానంలోకి వచ్చింది. ప్రొటీస్ ఏడు నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 2019 ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్‌ని ఐసీసీ ప్రారంభించగా.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు (తొమ్మిది దేశాలు) పోటీపడుతున్నాయి.

27 సిరీస్‌ల్లో 71 టెస్టులు

27 సిరీస్‌ల్లో 71 టెస్టులు

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ప్రతి క్రికెట్ జట్టు సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్‌లు ఆడనుంది. మొత్తంగా 27 సిరీస్‌ల్లో 71 టెస్టులు జరగనున్నాయి. రెండేళ్ల ఈ ఛాంపియన్‌షిప్‌లో చివరగా టాప్-2లో నిలిచిన జట్ల మధ్య 2021 జూన్‌ నెలలో ఫైనల్ జరగనుంది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టెస్టు ఛాంపియన్‌గా నిలవనుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ వచ్చినప్పటినుండి ప్రతి టీమ్ ఫైనల్ చేరాలని చూస్తున్నాయి.

టాప్‌లో భారత్

టాప్‌లో భారత్

ఐసీసీ తాజాగా వెల్లడించిన టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో ఎప్పటిలానే భారత్ టాప్‌లో కొనసాగుతోంది. ఇప్పటికి 4 సిరీస్‌లు ఆడిన టీమిండియా .. 9 టెస్టుల్లో గెలిచి, రెండింట్లో ఓడింది. ప్రస్తుతం 360 పాయింట్లతో టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా 3 సిరీస్‌లు ఆడి 296 పాయింట్లు, న్యూజిలాండ్ మూడు సిరీస్‌‌ల్లో తలపడి 180 పాయింట్లతో టాప్-3లో కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్ 146 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్ (140), శ్రీలంక (80) వరుసగా.. 5, 6లో కొనసాగుతున్నాయి. రెండో టెస్టు సిరీస్ ఆడుతున్న వెస్టిండీస్ తొలి విజయంతో 40 పాయింట్లని ఖాతాలో వేసుకుని ఏడో స్థానంలో నిలిచింది. ఎనమిది, తొమ్మిది స్థానాల్లో దక్షిణాఫ్రికా (24), బంగ్లా (0) ఉన్నాయి.

టెస్టుల సంఖ్య ఆధారంగా పాయింట్లు

టెస్టుల సంఖ్య ఆధారంగా పాయింట్లు

సిరీస్‌లోని టెస్టుల సంఖ్య ఆధారంగా ఛాంపియన్‌షిప్ పాయింట్లను విభజిస్తారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో గరిష్టంగా ఐదు టెస్టులు మాత్రమే ఆడాలి. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ అయితే మ్యాచ్‌లో విజేతకు 60 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ అయితే మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 40 పాయింట్లు కేటాయిస్తారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ అయితే మ్యాచ్‌ నెగ్గిన జట్టుకు 30 పాయింట్లు కేటాయిస్తారు. ఐదు టెస్టు మ్యాచ్‌ సిరీస్‌ జరిగితే మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 24 పాయింట్లగా నిర్ణయించారు.

'అయ్య బాబోయ్.. అసలు ధోనీ తెలియని వారు క్రికెట్‌ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా?'

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, July 13, 2020, 15:43 [IST]
Other articles published on Jul 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X